విశ్వంభర.. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్న సినిమా కాస్తా.. బాగా ఆలస్యం అవుతోంది. రిలీజ్ ఎప్పుడో క్లారిటీయే లేదు. నిజానికి ‘విశ్వంభర’ మొదలైనపుడు ఫుల్ పాజిటివ్ బజ్ ఉంది కానీ.. ఫస్ట్ టీజర్ వచ్చాక అంతా మారిపోయింది. అందులో విజువల్స్, ఎఫెక్ట్స్ విపరీతమైన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకోవడం.. బాగా ట్రోలింగ్ జరగడంతో చిత్ర బృందం అప్రమత్తం అయింది. అప్పటిదాకా ఉన్న వీఎఫెక్స్ కంటెంట్ అంతా పక్కన పెట్టి మళ్లీ కొత్తగా వర్క్ చేయడం మొదలుపెట్టిందని.. అందుకే సినిమా ఇంత ఆలస్యం అవుతోందని అంటున్నారు. ఐతే ఓవైపు రీవర్క్ చేస్తున్న సంగతి నిజమని చెబుతూనే.. మరోవైపు తాము టీజర్లో చూపించిన కంటెంట్‌లో తప్పేంటని అంటున్నాడు దర్శకుడు వశిష్ఠ.
‘విశ్వంభర’ టీజర్లో చూపించిన విజువల్స్‌ను ‘అవతార్’ సినిమాలోని సన్నివేశాలతో పోల్చడంపై వశిష్ఠ అభ్యంతరం వ్యక్తం చేశాడు. హాలీవుడ్లో ఏం చేసినా గొప్ప అనుకోవడం, ప్రతిదీ అక్కడి నుంచే మనం రెఫరెన్స్ తీసుకుంటున్నాం అనుకోవడం తప్పని వశిష్ఠ అభిప్రాయపడ్డాడు. తమ టీజర్లో చూపించినట్లు పొడవైన చెవులతో ఉన్న అమ్మాయి రూపం ‘అవతార్’లో మాత్రమే ఉందని.. అలా మరే సినిమాలోనూ చూపించలేదా అని అతను ప్రశ్నించాడు. ఇక వేలాడే కొండల్ని కూడా ‘అవతార్’లోనే తొలిసారి చూశామా అని అతనడిగాడు. అవతార్ సినిమా 2008లో వచ్చిందని.. కానీ 1998లో వచ్చిన ‘చందమామ’ ఎడిషన్లోని ‘జ్వాలాముఖి’ కథలో ఈ రెఫరెన్సులు ఉన్నాయని.. తాను దాన్నుంచి రెఫరెన్స్ తీసుకున్నానని.. కానీ కొట్టానని అంటే సంతోషించేవాడినని వశిష్ఠ అన్నాడు.
హాలీవుడ్లో ‘హల్క్’ తీయడానికి ముందే తెలుగులో అలాంటి కథతో కృష్ణ హీరోగా ‘మహాబలుడు’ వచ్చిందని.. ‘హాలోమన్’ తరహా చిత్రం కూడా ‘శభాష్ సత్యం’ పేరుతో కృష్ణనే ఓ సినిమా చేశారని.. ‘హ్యారీ పోటర్’లో స్టిక్స్ మీద నడిచే సన్నివేశాలను ఓ సినిమాలో రమణారెడ్డి చేశారని వివరించాడు వశిష్ఠ. మన దగ్గర మంచిని వదిలేసి వాళ్లది బాగుందని అనడం మనకు అలవాటని.. ఇలాంటి రెఫరెన్సులన్నీ మన దగ్గర్నుంచి హాలీవుడ్ వాళ్లు తీసుకున్నారని ఎందుకు ఆలోచించరని వశిష్ఠ ప్రశ్నించాడు. హాలీవుడ్ వాళ్లకు ముందు నుంచి బడ్జెట్లు, స్పేస్ ఉన్నాయని.. ఇంతకుముందు మనకు ఆ సౌలభ్యం లేదని.. ఇప్పుడు మన వాళ్ల ఆలోచన విధానం ఇప్పుడు మారి, పెద్ద స్థాయిలో ఆలోచిస్తున్నారని వశిష్ఠ చెప్పాడు.
This post was last modified on July 29, 2025 3:11 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…