Movie News

క్రిష్ మౌనవ్రతం వెనుక మతలబు

హరిహర వీరమల్లు విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో దర్శకుడు క్రిష్ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడైనా ఒక ఈవెంట్ లేదా ఇంటర్వ్యూలో మాట్లాడతారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ నెరవేరలేదు. రిలీజ్ కు ముందు రోజు సుదీర్ఘంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్వీట్ వేశారు తప్పించి అంతకు మించి ఎలాంటి పబ్లిసిటీలో భాగం కాలేదు. ఒకవేళ ఆయన తీసింది సగం సినిమానే అయినా దాని కోసమైనా కెమెరా ముందుకు రావాల్సిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ అసలు మతలబు ఏంటో సినిమా చూశాక, జ్యోతి కృష్ణ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ చూశాక అర్థమయ్యింది.

అయిదేళ్ల క్రితం ఈ కథను రాసుకున్నప్పుడు క్రిష్ అనుకున్న ట్రీట్ మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది కాదు. కోహినూర్ వజ్రం చుట్టూ కథను నడిపించి మాయాబజార్ తరహాలో ఎంటర్ టైన్మెంట్ ప్లస్ పీరియాడిక్ యాక్షన్ గా ప్లాన్ చేసుకున్నారు. కానీ జాప్యాలు, వాయిదాలు, అవాంతరాలు దాన్ని సాఫీగా ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో క్రిష్ బయటికి వచ్చాడు. జ్యోతికృష్ణ చేతికి వచ్చేటప్పటికీ అదే స్పాన్, అదే టెంపోలో తీసే అవకాశం కనిపించలేదు. దీంతో కీలక మార్పులు చేసుకుని కొత్త పాయింట్లు జోడించి వేరే వెర్షన్ సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా మనం సెకండాఫ్ లో చూస్తున్నది ఇదే.

ఇదంతా జ్యోతికృష్ణనే చెప్పుకొచ్చారు కాబట్టి ఉత్తి ప్రచారమని కొట్టి పారేయడానికి లేదు. విఎఫెక్స్, నిడివి మీద వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని కొత్త రీ లోడెడ్ వెర్షన్ ని మొన్నటి నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు కానీ వసూళ్ల మీద దాని ప్రభావం చెప్పుకునే స్థాయిలో కనిపించడం లేదు. బ్రేక్ ఈవెన్ ఏమో కానీ ముప్పాతిక రికవర్ అయినా గొప్పే అనేలా పరిస్థితి మారిపోయింది. ఒకపక్క మహావతార్ నరసింహా అంతకంతా పెట్రేగిపోతుండగా సైయారా సైతం దూసుకుపోతోంది. ఎటొచ్చి వీరమల్లునే ఎదురీదాల్సి వస్తోంది. ఘాటీ ప్రమోషన్లకు బయటికి వచ్చినప్పుడు క్రిష్ ఏమైనా మాట్లాడతాడేమో చూడాలి.

This post was last modified on July 29, 2025 10:49 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

7 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

8 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

8 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago