బాలీవుడ్ ఎవర్ గ్రీన్ టాప్ 10 క్లాసిక్స్ అని రాసుకుంటే వాటిలో ఖచ్చితంగా చోటు దక్కించుకునే మూవీ దీవార్. అమితాబ్ బచ్చన్ కు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చిన మాస్టర్ పీస్ గా దీనికి ఫ్యాన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. దీని స్ఫూర్తితో అప్పట్లో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. ఎక్కడిదాకో ఎందుకో పోకిరిలో మహేష్ బాబు షట్టర్ కు తాళం వేసి సుబ్బరాజు గ్యాంగ్ ని చితకబాదే ఎపిసోడ్ గుర్తుందిగా. దాన్ని పూర్తి జగన్నాధ్ నేరుగా ఈ దీవార్ నుంచే తీసుకున్నాడు. అదెంత అదిరిపోయే యాక్షన్ బ్లాకయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అసలు పాయింటుకొద్దాం.
ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలిలో కూడా దీవార్ రెఫరెన్సులు బలంగా ఉన్నాయట. వాటి ప్రకారం పోర్ట్ లో డైలీ లేబర్ల శ్రమను దోచుకుంటున్న సిండికేట్ ని ఒక మాములు కూలి ఎదిరిస్తాడు. అక్కడితో ఆగకుండా వాళ్ళను తొక్కేసే స్థాయిలో మాఫియా డాన్ గా ఎదుగుతాడు. కొంత కాలం అయ్యాక కనుమరుగైపోయి సాధారణ జీవితంలోకి వచ్చాక గతం తాలూకు నీడలు మళ్ళీ వెంటాడుతాయి. తిరిగి తన పూర్వ రూపం బయటికి తీస్తాడు. ఇదీ స్థూలంగా చెన్నై వర్గాల నుంచి వినిపిస్తున్న కూలి స్టోరీ. దీవార్ మెయిన్ లైన్ కూడా దీనికి దగ్గరగా ఉంటుంది. కార్మికులను రోజూ వేధించే వాళ్ళకు విజయ్ అనే కూలి తిరగబడతాడు.
దాని వల్లే ముంబై బడా మాఫియా డాన్ల దృష్టిలో పడి కోట్లకు పడగలెత్తుతాడు. కాకపోతే సెకండ్ హీరో శశికపూర్ ట్రాక్, చివర్లో అమితాబ్ ప్రాణ త్యాగం చేయడం వగైరాలు ఎమోషనల్ ట్రాక్ లో సాగుతాయి. కూలిలో సెకండ్ హాఫ్ అంతా వేరే ట్రీట్ మెంట్ లో ఉంటుందన్న మాట. అయినా లోకేష్ ఇలా ఇన్స్ ఫైర్ కావడం ఇదేం మొదటిసారి కాదు. ఒక్క ఖైదీ తప్ప మాస్టర్, లియో లాంటివి హాలీవుడ్, టాలీవుడ్ నుంచి ఎంతో కొంత తీసుకొచ్చినవే. లియో మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే జరిగింది. ఇదంతా ఎలా ఉన్న హైప్ తోనే అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లే లోకేష్ కనగరాజ్ కూలితో వెయ్యి కోట్లు కొడతాడేమో చూడాలి.
This post was last modified on July 28, 2025 6:19 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…