భోళా శంకర్ తర్వాత బాగా గ్యాప్ వచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ఈసారి అభిమానులను బ్యాక్ టు బ్యాక్ పలకరించబోతున్నారు. విశ్వంభర చివరి పాట షూట్ లో ఉన్న సంగతి తెలిసిందే. చిన్న ప్యాచ్ వర్క్ కూడా ఈ షెడ్యూల్ లోనే పూర్తి చేస్తారు. సెప్టెంబర్ ఛాన్స్ లేదు కాబట్టి అక్టోబర్ లేదా డిసెంబర్ ఆప్షన్లను నిర్మాతలు చూస్తున్నట్టుగా సమాచారం. అఫీషియల్ గా ఖరారు చేయాల్సి ఉంది. దీని తర్వాత జనవరిలో సంక్రాంతి కానుకగా మెగా 157 వచ్చేస్తుంది. ఇంత తక్కువ గ్యాప్ లో చిరు రెండు సినిమాలు రిలీజ్ కావడం గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ జరగలేదు. ఒకవేళ అయితే కనక ఇదో సెన్సేషన్ కావడం ఖాయం.
వీటి తర్వాత మెగాస్టార్ లైనప్ లో మరో రెండు మూవీస్ ఉన్నాయి. వాల్తేరు వీరయ్య కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. స్టోరీ, స్క్రిప్ట్ రెండూ సిద్ధమవుతున్నాయట. పూనకాలు లోడింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ యూనిట్ వర్గాలు మాత్రం కాదంటున్నాయి. ఈ ఏడాది చివర్లో మొదలుపెట్టి వచ్చే వేసవికి అంత పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ప్లాన్ చేస్తున్నారట. నానితో ది ప్యారడైజ్ పూర్తయ్యాక శ్రీకాంత్ ఓదెల మెగా క్యాంప్ లోకి అడుగు పెడతాడు. మెగాస్టార్ మోస్ట్ వయొలెంట్ మూవీగా దీని మీద అనౌన్స్ మెంట్ స్టేజి నుంచి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
చూస్తుంటే రజనీకాంత్ తరహాలో చిరంజీవి దూకుడు పెంచుతున్న వైనం కనిపిస్తోంది. తన కథల ఎంపిక పట్ల ఫ్యాన్స్ నుంచి వస్తున్న నెగటివ్ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న చిరు ఈసారి కొత్త జనరేషన్ డైరెక్టర్లకు మాత్రమే ఓకే చెప్పారు. వసిష్ఠ అనిల్ రావిపూడి, బాబీ, శ్రీకాంత్ ఓదెల తదితరులంతా ఒకటి రెండు నుంచి పది సినిమాల లోపే అనుభవమున్న వాళ్ళు. అన్నింటిని మించి చిరు మీద విపరీతమైన అభిమానమున్న ఫ్యాన్ బాయ్స్ కావడంతో కంటెంట్ పరంగా ఓ రేంజ్ లో ఊహించుకోవచ్చు. ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే రాబోయే రెండేళ్లలో చిరంజీవి నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి.
This post was last modified on July 28, 2025 1:40 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…