Movie News

మౌనంగా ఘాటీ… అజ్ఞాతంలో స్వీటీ

అనుష్క ఘాటీ ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 18, జూలై 11 ఈ ఏడాది వదులుకున్న డేట్లు. వీటిలో ఏ తేదీకి వచ్చినా మంచి ఓపెనింగ్స్ తో పాటు సాలిడ్ రన్ దక్కేది. కానీ రకరకాల కారణాల వల్ల పోస్ట్ పోన్ తప్పలేదు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ లాంటి రీజన్స్ చెబుతున్నారు కానీ నిజానికి అంత హెవీ వర్క్ ఉన్న గ్యాంగ్ స్టర్ డ్రామా అయితే ఇది కాదు. మరి ఎందుకు లేట్ అవుతుందనేది అంతు చిక్కడం లేదు. ఫిలిం నగర్ వర్గాల్లో సెప్టెంబర్ 5 రావొచ్చనే ప్రచారం మొన్నటిదాకా జరిగింది. కానీ ఇప్పుడా సౌండ్ లేదు. ఎందుకంటే తేజ సజ్జ మిరాయ్ అదే డేట్ కి ముందు ప్రకటించినట్టుగా రిలీజ్ కాబోతోంది కాబట్టి.

ముందైతే ఘాటీ నిర్మాతలు యువి క్రియేషన్స్ మౌనం వీడాలి. చూచాయగా ఎప్పుడు వస్తుందో హింట్ ఇవ్వాలి. ఇదే తరహాలో విశ్వంభరని విపరీతమైన జాప్యానికి గురి చేసిన ప్రొడ్యూసర్లు దాని బజ్ తగ్గిపోవడంలో టీజర్ తో పాటు సమాన బాధ్యత పంచుకున్నారు. ఇప్పుడు ఘాటీకి కూడా ఇంచుమించు అదే పరిస్థితి కనిపిస్తోంది. దర్శకుడు క్రిష్ ఎక్కడా కనిపించడం లేదు. హరిహర వీరమల్లుకు ట్విట్టర్ లో విష్ చేసి ఊరుకున్నాడు తప్పించి తన వంతుగా మీడియా ముందుకొచ్చి విశేషాలు పంచుకోలేదు. సరే ఘాటీ పనుల్లో బిజీగా ఉన్నాడని అనుకున్నా కనీసం ఒకటి రెండు రోజులు తీరిక చేసుకోవచ్చు కదా.

ఇక అనుష్క సంగతి సరేసరి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్క్రీన్ మీద, స్క్రీన్ బయట ఎక్కడా దర్శనమివ్వలేదు. ఘాటీ ప్రమోషన్లకైనా వస్తుందో రాదో తెలియదు. తన మీద ఎన్ని గాసిప్స్ వస్తున్నా పట్టించుకోకుండా అజ్ఞాతంలోనే ఉన్న స్వీటీని ఓసారైనా నేరుగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఆ కోరిక నెరవేరేలా లేదు. స్వీటీని ఎప్పుడు చూస్తామంటూ ప్రశ్నించడమే తప్ప సమాధానం దొరకడం లేదు. ఒకవేళ ఘాటీ కనక సెప్టెంబర్ వదులుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఏదో ఒకటి వీలైనంత త్వరగా లాక్ చేసుకోవాలి. లేదంటే బజ్ మరింత కిందకు వెళ్లిపోయే ప్రమాదముంది. ఫ్యాన్స్ భయపడుతోంది అదే.

This post was last modified on July 28, 2025 9:19 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago