ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న వార్ 2 మీద బాలీవుడ్ వర్గాలే కాదు టాలీవుడ్ ట్రేడ్ కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తోంది. కారణం జూనియర్ ఎన్టీఆర్. హృతిక్ రోషన్ తో మొదటిసారి తెరను పంచుకోవడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టీజర్ మీద కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ట్రైలర్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ సరిచేసే ప్రయత్నం చేసింది. ఇప్పటికైతే ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉంది కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ కంటెంట్ వదలాల్సిన అవసరం చాలా ఉంది. ఇక వార్ 2 బడ్జెట్, రెమ్యునరేషన్లకు సంబంధించిన కొన్ని విషయాలు ముంబై మీడియాతో పాటు మన దగ్గర కూడా హాట్ టాపిక్ గా మారాయి.
వాటి ప్రకారం వార్ 2 ఇప్పటిదాకా హిందీలో వచ్చిన అత్యంత ఖరీదైన స్పై మూవీ. 400 కోట్ల బడ్జెట్ ఖర్చయ్యిందట. జూనియర్ ఎన్టీఆర్ కు 70 కోట్ల దాకా ఇచ్చారని తెలిసింది. హృతిక్ రోషన్ కు తక్కువగా 50 కోట్లు ఇచ్చినప్పటికీ రిలీజయ్యాక వచ్చిన లాభాల్లో ప్రాఫిట్ షేరింగ్ మీద అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే ఆ సొమ్ము రెట్టింపయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కియారా అద్వానీకి 15 కోట్లు, అనిల్ కపూర్ కు 10 కోట్ల దాకా ముట్టిందట. దర్శకుడు అయాన్ ముఖర్జీకి 30 కోట్ల దాకా కిట్టుబాటు అయ్యిందని వినికిడి. అంటే మొత్తం పారితోషికాలు 150 కోట్లు అయితే మిగిలిన 220 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్.
ఇప్పటిదాకా యష్ ఫిలింస్ ఇంత బడ్జెట్ ఏ గూఢచారి సినిమాకు పెట్టలేదు. మునుపటి రికార్డు 350 కోట్లతో టైగర్ 3, 325 కోట్లతో పఠాన్ పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు వాటిని వార్ 2 ఓవర్ టేక్ చేసింది. ఇంత సొమ్ములు కుమ్మరించారంటే కంటెంట్ ఏదో క్రేజీగా ఉందని అర్థమవుతోంది. ఇప్పటిదాకా ప్రమోషన్ లో వచ్చిన వీడియో కంటెంట్ కేవలం శాంపిల్స్ మాత్రమేనని అసలైన సినిమా చూశాక థ్రిల్ తో ఉక్కిరిబిక్కిరి చేసే ఎపిసోడ్స్ చాలా ఉంటాయని యూనిట్ వర్గాలు ఊరిస్తున్నాయి. అవి నిజమైతేనే కూలి లాంటి విపరీతంమైన హైప్ ఉన్న మూవీ పోటీని తట్టుకోవడానికి సులభమవుతుంది. ఫ్యాన్స్ కోరుతున్నది అదే.
This post was last modified on July 26, 2025 6:32 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…