సుమారు ఏడాది కాలంగా విడుదల వాయిదా వేసుకుంటూ వచ్చిన నారా రోహిత్ సుందరకాండ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్ట్ 27 లాక్ చేస్తూ వీడియో బైట్ రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీదేవి విజయ్ కుమార్ తర్వాత కొన్ని సినిమాలు చేసి టాటా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇంత లేట్ గా వస్తున్నా హీరోయిన్ గానే పునఃప్రవేశం చేయడం గమనించాల్సిన విషయం. డేట్ వినడానికి బాగానే ఉంది కానీ ఆగస్ట్ 27 ఆల్రెడీ రవితేజ మాస్ జాతర లాక్ చేసుకుంది. ఆ మేరకు షూటింగ్ చివరి దశ పరుగులు పెడుతోంది.
మరి నారా రోహిత్ టీమ్ ఏ కాన్ఫిడెన్స్ తో క్లాష్ కు సిద్ధపడిందనేది ఆసక్తికరం. వెంకటేష్ కెరీర్ లో క్లాసిక్ అని చెప్పుకోదగ్గ వాటిలో సుందరకాండ ముందు వరసలో ఉంటుంది. అదే పేరుతో బాపు గారు చార్మీ ప్రధాన పాత్ర లో ఇంకో చిత్రం తీశారు కానీ అది వర్కౌట్ కాలేదు. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత నారా రోహిత్ దాన్ని వాడుకున్నాడు. ఇటీవలే తండ్రి చనిపోయిన విషాదంలో రవితేజ కొద్దిరోజులు బ్రేక్ తీసుకున్నాడు. మాస్ జాతరకు ఒక పాట, ప్యాచ్ వర్క్ తప్ప ఎక్కువ బాలన్స్ లేదని ఇన్ సైడ్ టాక్. శ్రీలీల డేట్లు ఇంకొన్ని కావాలట. అందుకే ఈ గ్యాప్ లో కిషోర్ తిరుమలకు మాస్ మహారాజా డేట్లు ఇచ్చాడు.
ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 27 మిస్ కాకూడదనేది రవితేజ, నిర్మాత నాగవంశీ టార్గెట్. దానికి అనుగుణంగానే ప్లానింగ్ వేగవంతం చేశారు. ఇంకా థియేటర్ బిజినెస్ మొదలుపెట్టలేదు. కానీ ట్రైలర్ కాగానే ఆ లాంఛనం చేయబోతున్నారు. ప్రస్తుతం సితార టీమ్ కింగ్డమ్ రిలీజ్, వార్ 2 డిస్టిబ్యూషన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. ఇవి కొలిక్కి రాగానే మాస్ జాతర ప్రమోషన్లు వేగవంతం చేయాలి. మాస్ అండ్ ఎంటర్ టైన్మెంట్ రైటర్ గా మంచి పేరున్న భాను భోగవవరపు మాస్ జాతరతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విక్రమార్కుడు ప్లస్ కిక్ క్యారెక్టరైజేషన్స్ ని మిక్స్ చేసి రవితేజని సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్టు వినికిడి.
This post was last modified on July 25, 2025 7:25 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…