Movie News

మొత్తం క్రిష్‌యే తీసి ఉంటే..

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘హరిహర వీరమల్లు’. ఐతే అభిమానులు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. ప్రథమార్ధం వరకు బాగానే అనిపించినా.. ద్వితీయార్ధంలో సినిమా గాడి తప్పిందన్నది మెజారిటీ ప్రేక్షకులు చెబుతున్న మాట. సెకండాఫ్‌లో ప్రేక్షకులు ఊహించుకున్నది ఒకటి. అక్కడ కనిపించింది ఒకటి. ఇంటర్వెల్ బ్లాక్ చూశాక హీరో వెళ్లి కోహినూర్ వజ్రాన్ని ఎలా తీసుకొస్తాడా అని చూస్తే.. ఢిల్లీ వరకు తన జర్నీతో లాగించేశాడు దర్శకుడు జ్యోతికృష్ణ. మధ్యలో ధర్మ పరిరక్షకుడిగా తన పాత్రలోని మరో కోణాన్ని చూపించి కథను డీవియేట్ చేశాడనే అభిప్రాయం కలిగింది.

చివర్లో ఒక తుపాను ఎపిసోడ్‌తో సినిమాను మొక్కుబడిగా ముగించారు. ఔరంగజేబుతో తన పోరాటమే చూపించలేదు. కోహినూర్ వజ్రం సంగతి కూడా పక్కకు వెళ్లిపోయింది. ఇదంతా పార్ట్-2లో చూసుకోమన్నట్లుగా ఎండ్ కార్డ్ వేశారు. ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న ఎపిసోడ్ల తాలూకు క్రెడిట్ క్రిష్‌కే కట్టబెడుతున్నారు ప్రేక్షకులు. ప్రథమార్ధంలో చాలా వరకు క్రిష్ తీసిందే. ఆ సన్నివేశాలు నీట్‌గా అనిపించాయి. వాటిలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం తక్కువే. ఉన్నా కూడా అవి నీట్‌గానే అనిపించాయి.

కానీ ద్వితీయార్ధం అంతా పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్.. బోరింగ్ సన్నివేశాలు.. కథను పక్కదారి పట్టించే సీన్లతో సినిమా గాడి తప్పింది. ద్వితీయార్ధం అంతా మార్చామని, జ్యోతికృష్ణ కొత్త సీన్లు రాసి డైరెక్ట్ చేశాడని స్వయంగా నిర్మాత రత్నమే వెల్లడించాడు. కాబట్టి సినిమాలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న సెకండాఫ్ విషయంలో క్రెడిట్ జ్యోతికృష్ణకే ఇవ్వాల్సి ఉంటుంది. క్రిష్ ఈ సినిమా తీసి ఉంటే ఔట్ పుట్ వేరుగా ఉండేదని.. అసలు వీఎఫెక్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉండేవాడు కాదని.. ధర్మ పరిరక్షణ ట్రాక్ అంతా తీసేసి.. ఢిల్లీకి వెళ్లి కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే టాస్క్ మీద కథను నడిపించి ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించేవాడని.. ప్రథమార్ధం లాగే ద్వితీయార్ధం కూడా రేసీగా సాగి సినిమా ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on July 25, 2025 6:55 pm

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

3 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

10 minutes ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

4 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

5 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

7 hours ago