దర్శకులు తాను ఫలానా హీరోకు ఫ్యాన్ అని చెప్పడం మామూలే. ఐతే ఎక్కువగా తమ భాషకు చెందిన హీరోల గురించే ఇలా చెబుతుంటారు. కానీ తమిళంలో ఇప్పుడు టాప్ డైరెక్టర్లోలో ఒకడిగా ఉన్న లోకేష్ కనకరాజ్.. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు పెద్ద ఫ్యాన్ అని చెప్పడం విశేషమే. ఏదో మొక్కుబడిగా ఈ మాట అనలేదతను. నాగ్ ఫిల్మోగ్రఫీలో చాలా స్పెషల్ అయిన సినిమాల గురించి ప్రస్తావించి.. అవి తన మీద ఎంత ప్రభావం చూపాయో కూడా అతను వివరించాడు. నాగ్ ముందు ఒప్పుకోకున్నా.. ఆయన వెంటపడి మరీ అతను ‘కూలీ’లో విలన్ పాత్ర కోసం ఒప్పించిన సంగతి తెలిసిందే. నాగ్ మీద అభిమానంతోనే ఆయన్ని ఈ సినిమాలో నటింపజేసినట్లు అతను వెల్లడించాడు.
నాగ్ సినిమాల్లో అత్యంత హైప్ తెచ్చుకున్న ‘రక్షగన్’ (రక్షకుడు) తనకు ఆల్ టైం ఫేవరెట్ అని లోకేష్ వెల్లడించాడు. ఆ సినిమా టైంకి తాను స్కూల్లో ఉన్నానని.. ఆ సినిమాలో నాగ్ లుక్, యాటిట్యూడ్ తన మీద చాలా ఎఫెక్ట్ చూపించాయని.. కాలేజీ లైఫ్ అంతా తాను సేమ్ హేర్ స్టైల్ మెయింటైన్ చేశానని లోకేష్ తెలిపాడు. ఈ మధ్యే తాను జుట్టు తగ్గించినట్లు తెలిపాడు. ఇక నాగ్ నటించిన శివ, గీతాంజలి, అన్నమయ్య.. ఇలా చాలా సినిమాలు చూసి తాను ఫిదా అయిపోయానని.. ఆయన స్టైల్ తనకెంతో ఇష్టమని లోకేష్ తెలిపాడు.
‘కూలీ’ సినిమా కోసం నాగార్జునను ఒప్పించడం చాలా కష్టమైందని లోకేష్ చెప్పాడు. ముందు ఈ సినిమా చేయననే ఆయన అన్నారని.. కానీ ఆరేడుసార్లు ఆయన వెంటపడి.. మళ్లీ మళ్లీ తన క్యారెక్టర్ గురించి చెప్పి ఒప్పించానని లోకేష్ తెలిపాడు. ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి, రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి అని చెప్పాక నాగ్.. సరే ట్రై చేద్దాం అని ఇందులో విలన్ పాత్రకు అంగీకరించినట్లు లోకేష్ తెలిపాడు. ‘కూలీ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 26, 2025 12:38 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…