సినీ రంగంలో తొలి రోజుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఆ తర్వాత ఒక స్థాయి అందుకున్నాక పాత రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలను తర్వాత పంచుకోవడం మామూలే. ముఖ్యంగా హీరోయిన్లకు ఇలాంటి అనుభవాలు చాలానే ఉంటాయి. హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న చాలామంది హీరోయిన్లు ఇలా పాత అనుభవాలను పంచుకున్న వాళ్లే. కంగనా రనౌత్ ఇలాంటి కథలు చాలానే చెప్పింది.
ఈ మధ్య తాప్సి పన్ను నుంచి కూడా ఇలాంటి కథలు చాలా వింటున్నాం. కెరీర్ ఆరంభంలో తాప్సి ఎక్కువగా గ్లామర్ పాత్రలు, అంతగా గుర్తింపు లేని రోల్సే చేసింది. అప్పుడు తన మీద గ్లామర్ తారగా ముద్ర వేసి ప్రతిభకు తగ్గ అవకాశాలివ్వకపోవడంపై, తనను చిన్న చూపు చూడటంపై ఇప్పటికే కొన్ని ఉదంతాలను ఆమె మీడియాతో పంచుకుంది.
తాజాగా మరికొన్ని ఆశ్చర్యకర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది తాప్సి. ఓ సినిమా నుంచి తనను హీరో భార్య తప్పించినట్లు తాప్సి తెలిపింది. తాను ఆ సినిమాలో కొనసాగడం హీరో భార్యకు నచ్చలేదని.. ఆమె బలవంతం మేరకు ఆ సినిమా మేకర్స్ తనను తీసేశారని ఆమె వెల్లడించింది. ఇక మరో సినిమాకు పని చేస్తుండగా.. తన వాయిస్ హీరోకు తాను చెప్పిన డైలాగ్ నచ్చలేదని, దాన్ని మార్చాలని చెప్పారని.. తాను అందుకు అంగీకరించకపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్టును పిలిపించి వేరే డైలాగ్ చెప్పించారని ఆమె చెప్పుకొచ్చింది.
ఒక హీరో ముందు సినిమా సరిగా ఆడలేదని తన పారితోషకంలో కోత విధించిన సందర్భాలు కూడా ఉన్నాయని.. కెరీర్ ఆరంభంలో ఇలాంటి విచిత్ర అనుభవాలు ఎన్నో తాను ఎదుర్కొన్నానని తాప్సి గుర్తు చేసుకుంది. దక్షిణాదిన తనను గ్లామర్ తారగా ప్రొజెక్ట్ చేయడం, రాఘవేంద్రరావు ‘ఝుమ్మంది నాదం’ సినిమాలో తన బొడ్డు మీద ఫోకస్ చేయడం గురించి తాప్సి ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 18, 2020 7:06 pm
అప్పుడెప్పుడో ఇంగ్లాండ్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టినట్టు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం…
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోవడంతో మెగాభిమానుల దృష్టి ఆర్సి 16 వైపుకు వెళ్తోంది. తాజాగా మూడో షెడ్యూల్ మొదలుపెట్టిన దర్శకుడు…
పరిటాల…ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. అటు రాజకీయంగా అయినా… ఇటు ఆయా ప్రాంతాలపై పట్టు…
వారసత్వ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఏ రంగంలోనైనా రాణిస్తారని,…
ఏపీలోని కూటమి సర్కారు రాష్ట్ర ప్రజలకు సోమవారం శుభ వార్త చెప్పింది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న భూముల ధరలు,…
గత డిసెంబర్ లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ ఓటిటి రిలీజ్…