బాలీవుడ్, టాలీవుడ్ కలయికకు శ్రీకారం చుడుతూ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన వార్ 2 ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన టీజర్ ఆశించిన స్థాయిలో అంచనాలు పెంచలేకపోయిన నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. బిజినెస్, ఓపెనింగ్స్ లో దీనిది కీలక పాత్ర కావడంతో ఎలా ఉంటుందోననే ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు వెర్షన్ ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ జరగడానికి ఒకే కారణం తారక్. మరి ఇంత హైప్ మోస్తూ కూలితో తలపడుతున్న వార్ 2 శాంపిల్స్ ఎలా ఉన్నాయి.
దేశంలో కోసం తన ఉనికిని సైతం వదులుకునేందుకు సిద్ధ పడే సిన్సియర్ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్). ఎలాంటి లక్ష్యమైనా సరే ఆయుధంగా మారేందుకు సిద్ధపడే మరో పవర్ ఫుల్ ఏజెంట్ విక్రమ్ (జూనియర్ ఎన్టీఆర్). ఈ ఇద్దరి టార్గెట్లు వేరుగా ఉంటాయి. శత్రువుల వల్ల ప్రమాదకర వలయాలు ఏర్పడతాయి. ప్రాణాలు పణంగా పెట్టే యుద్ధంలో భాగమవుతారు. వేర్వేరుగా ప్రయాణం చేస్తూ వచ్చిన కబీర్, విక్రమ్ చేతులు కలిపే సమయం వస్తుంది. అయితే పరిస్థితులు వాళ్ళను కొట్టుకునేలా కూడా చేస్తాయి. అసలు వార్ 2 ఎందుకు వచ్చింది, ఈ జంట ఎలాంటి విధ్వంసాలు చేసిందనేది తెరమీద చూడాలి.
రెండు నిమిషాల నలభై సెకండ్ల వీడియోలో ఎక్కువ యాక్షన్ విజువల్స్ కే ప్రాధాన్యం ఇచ్చారు. బ్లాస్టులు, ఛేజులు, విమానాల మీద స్టంటులు, రన్నింగ్ ట్రైన్ మీద సాహసాలు ఇలా చాలానే పొందుపరిచారు. వార్, పఠాన్, ఏక్ దా టైగర్ పంథానే ఫాలో అయినప్పటికీ హృతిక్, తారక్ ఫేస్ అఫ్ అంచనాలు పెంచేలా ఉంది. కథ ఎక్కువగా రివీల్ చేయకుండా ఫైట్లతో నింపేశారు. కియారా అద్వానీకి గ్లామర్, వయొలెన్స్ రెండూ దక్కాయి. ప్రీతమ్ అందించిన సంగీతం రెగ్యులర్ గానే ఉంది. యష్ రాజ్ ప్రొడక్షన్ వేల్యూస్ ఘనంగా ఉన్నాయి. అభిమానులు చెందేలా ఉంది కాబట్టి హైప్ పెరగడానికి ట్రైలర్ సరిపోతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates