మొన్న విడుదలైన హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ప్రారంభ వసూళ్లు అదిరిపోయాయి. బాక్సాఫీస్ ఎదురు చూస్తున్న గ్రాండ్ ఓపెనింగ్స్ ని ప్రీమియర్ల నుంచే మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ నిన్న సక్సెస్ మీట్ కు స్వయంగా వచ్చి తన ఆనందాన్ని పంచుకున్నారు. రివ్యూలు, సోషల్ మీడియా రియాక్షన్లు, పబ్లిక్ టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ టీమ్ మాత్రం బ్లాక్ బస్టరనే ధీమా వ్యక్తం చేస్తోంది. సెకండాఫ్ లో వచ్చిన విఎఫ్ఎక్స్ కంప్లైంట్స్ ని సరిచేసి రీ ప్లేస్ చేస్తున్నారని, ఒక పదిహేను నిమిషాల దాకా ట్రిమ్మింగ్ ఉండొచ్చనే టాక్ నిన్నటి నుంచే తిరుగుతోంది. ఈ రోజు షోలలో మార్పులు ఉంటాయేమో చూడాలి.
హరిహర వీరమల్లు పార్ట్ 2కి బ్యాటిల్ ఫీల్డ్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడొచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుని పార్ట్ 2కి జాగ్రత్త పడతామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందరూ రెండో భాగం ఎప్పుడని అడుగుతున్నారని దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పుకొచ్చారు. అయితే సీక్వెల్ తెరకెక్కడం కొన్ని సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది ముందు పార్ట్ 1 పూర్తిగా బ్రేక్ ఈవెన్ దాటేసి రికవర్ కావాలి. నష్టాలు లేకుండా గట్టెక్కాలి. ముఖ్యంగా నిర్మాత ఏఎం రత్నంకు కావాల్సినంత బడ్జెట్ పెట్టేంత భరోసా మార్కెట్ నుంచి దక్కాలి. అన్నింటికన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ డేట్లు కావాల్సిన సమయంలో దొరకాలి.
కానీ ప్రాక్టికల్ గా అంత ఈజీ కాదు కానీ అలాని అసాధ్యమూ కాదు. కాకపోతే బాహుబలి, పుష్ప, కెజిఎఫ్ రేంజ్ లో రెండో భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అనే రేంజ్ లో ఎగ్జైట్ మెంట్ కలిగించడంలో వీరమల్లు తడబడ్డాడు. ఆడియన్స్ లో ఈ ఫీలింగ్ తగ్గించగలిగితే ఆటోమేటిక్ గా రెండో భాగానికి డిమాండ్ ఏర్పడుతుంది. అసలే కామెంట్స్ ఎదురుకున్న అంశాల్లో క్లైమాక్స్ కూడా ఉంది. అక్కడి నుంచే పార్ట్ 2 కంటిన్యూ చేయాలి. ఈసారి స్క్రిప్ట్, విజువల్ ఎఫెక్ట్స్, క్యారెక్టరైజేషన్స్ మీద బలంగా వర్క్ చేయాలి. టైం లెక్క చేయకూడదు. ఇవన్నీ దాటుకుని పవన్ సహకారం అందుకుంటే కనక వీరమల్లు బ్యాటిల్ ఫీల్డ్ సాధ్యమే.
This post was last modified on July 25, 2025 9:56 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…