గత నెల రోజులకు పైగా సరైన పెద్ద హీరో సినిమా లేక ఖాళీగా ఉన్న థియేటర్లకు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన జోష్ అంతా ఇంతా కాదు . ‘హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’కు ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడంతో ఏపీ తెలంగాణలో సందడి వాతావరణం నెలకొంది. నైజాం బిజినెస్ టర్మ్స్ వల్ల బుకింగ్స్ బాగా ఆలస్యమైనపప్పటికీ బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో టికెట్లు పెట్టడం ఆలస్యం హాట్ కేక్స్ లా అమ్ముడుపోవడం పవన్ స్టామినాకి నిదర్శనం. హిట్ ట్రాక్ రికార్డు లేని ఒక దర్శకుడు హ్యాండిల్ చేసినా, సుదీర్ఘ నిర్మాణం వల్ల బజ్ తగ్గిపోయినా రికార్డులు బద్దలు కొట్టడం పవర్ స్టార్ కి మాత్రమే సాధ్యం.
తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ నుంచి ప్రాథమికంగా వినిపిస్తున్న టాక్ డీసెంట్ గా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వాగ్, యాక్షన్ ఎపిసోడ్స్, ఫస్ట్ హాఫ్ గురించి ఎక్కువగా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కనిపిస్తోంది. మధ్యాన్నానికి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. రిపోర్టుల సంగతి ఎలా ఉన్నా వీకెండ్ మొత్తం పవన్ కంట్రోల్ లోకి వెళ్లబోతోంది. నెంబర్లు ఇంకా అధికారికంగా బయటికి చెప్పలేదు కాబట్టి ప్రీమియర్ల వరకు పుష్ప 2ని దాటిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉంది. ఫస్ట్ డే ఓపెనింగ్ పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ అవ్వొచ్చని ముందస్తుగా అంచనాలున్నాయి. కంప్లీట్ టాక్ ని బట్టి రన్ ఆధారపడనుంది.
డ్రైవ్స్ పంపడంలో జరిగిన జాప్యం వల్ల ఓవర్సీస్ అంకెలు కొంచెం తక్కువగా ఉండబోతున్నాయి కానీ పికప్ అయితే మాత్రం అక్కడా రికార్డుల మోత ఖాయం. ఐదేళ్ల నిర్మాణం, విపరీతంగా పెరిగిపోయిన బడ్జెట్, భారీ సెట్లు, హద్దులు దాటేసిన ఖర్చు ఇవన్నీ తట్టుకుని నిర్మాత ఏఎం రత్నం ఎట్టకేలకు హరిహర వీరమల్లుని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేశారు. పార్ట్ 2ని ముందుకు తీసుకెళ్లడానికి ఇప్పుడీ మొదటి భాగం బ్లాక్ బస్టర్ కీలకం కావడంతో ఆయనతో పాటు ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి వీరమల్లు వీరంగం ఏ స్థాయిలో ఉండబోతోందో, ఎలాంటి మైలురాళ్ళు అందుకోబోతున్నాడో.
This post was last modified on July 24, 2025 6:30 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…