దేశమును ప్రేమించుమన్నా అని పెద్దలు అన్నారు కానీ నీ భాషను మాత్రమే అభిమానించమని, వేరేవాటిని ద్వేషించమని ఎవరూ చెప్పలేదు. కానీ కర్ణాటకలో మాత్రం ఇది వింత రంగులు పులుముకుంటోంది. హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా బెంగళూరులోని ఒక థియేటర్ ని పెద్ద పెద్ద బ్యానర్లతో ఘనంగా అలంకరించారు. అందులో ప్రదర్శించేది తెలుగు వెర్షన్ కాబట్టి ఇలా చేయడం సహజం. కానీ ఏ బ్యానర్ లోనూ కన్నడ భాష లేదని ఆగ్రహించిన కొందరు అక్కడికి చేరుకొని వాటిని చింపేయడంతో వివాదం మొదలయ్యింది. పవన్ ఫ్యాన్స్ వద్దని వేడుకుంటున్నా వినకుండా అతి చేయడం గమనార్హం.
తమిళ మలయాళం సినిమాలు ప్రదర్శించినప్పుడు రాని అభ్యంతరం కేవలం పవన్ మూవీ రిలీజ్ టైంలోనే ఎందుకు వస్తుందనేది మెగాభిమానుల ప్రశ్న. దీని వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. కన్నడలో బ్యానర్లు పెట్టనందుకు లక్ష రూపాయలు ఫైన్ చెల్లించాలని నిరసనకారులు డిమాండ్ చేసినట్టు వస్తున్న వార్తలు డౌట్లు తేప్పిస్తున్నాయి. ఇలా అడగడం నిజమో కాదో కానీ సోషల్ మీడియాలో చర్చలైతే జోరుగా ఉన్నాయి. బ్యానర్ చించుతున్న వీడియోలు వైరల్ కావడంతో ఇలా చేసినవాళ్ల మీద ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పడం కష్టం.
ఆ మధ్య ఒక బ్యాంక్ మేనేజర్ కన్నడలో మాట్లాడనని చెప్పినందుకు వ్యవహారం ఆమెను ట్రాన్స్ ఫర్ చేసే దాకా వెళ్ళింది. అయినా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పెద్దిలో నటిస్తున్నాడు. కేవలం రజనీకాంత్ సినిమా అనే ఒకే కారణంతో పాత్ర ఏంటని అడగకుండా ఉపేంద్ర కూలిలో చేశాడు. గతంలో కన్నడ ప్రభాకర్, దేవరాజ్, కిచ్చ సుదీప్, దునియా విజయ్ లాంటి ఎందరో స్టార్లు తెలుగు సినిమాల్లో విలన్లుగా నటించారు. మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. వాళ్లే భాషావిభేదాలు లేకుండా నడుచుకుంటూ ఉంటే ఇలా కొందరు మాత్రం లాంగ్వేజ్ పేరుతో బ్యానర్ రాజకీయాలు చేయడం ఖండించాల్సిన విషయం.
This post was last modified on July 23, 2025 5:27 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…