ఈ రోజుల్లో సినిమాలకు ప్రమోషన్లు అన్నవి ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. ఒకప్పుడు ప్రమోషన్లను పెద్దగా పట్టించుకోని స్టార్ హీరోలందరూ కూడా ఇప్పుడు కాలికి బలపం కట్టకుని తిరిగేస్తున్నారు. ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనడంతో పాటు మీడియాకు ఇంటర్వ్యూలూ ఇస్తున్నారు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్లు ప్రమోషన్ల వల్ల కలిగే ప్రయోజనమేంటో చాటిచెప్పాక టాలీవుడ్ స్టార్లు కూడా వారిని అనుసరించడం మొదలుపెట్టారు.
కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తన సినిమాలను ప్రమోట్ చేయడం తక్కువే. రాజకీయాల్లో బిజీ కావడానికి ముందు కూడా ఆయన మహా అయితే ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనేవాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అరుదు. ఐతే తన కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం మాత్రం ఆయన టీంతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇదంతా కేవలం నిర్మాత ఏఎం రత్నం కోసమే అని ఆయన స్పష్టం చేశారు. ఇక తాను సినిమాలకు సంబంధించి ఎందుకు మీడియాకు దూరంగా ఉంటానో పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
పవన్ హీరో అయిన కొత్తలో జ్యోతిచిత్ర, సితార లాంటి ఫిలిం మ్యాగజైన్లలో పవన్ ఫొటో వేసేవారు కాదట. ఇతను సేలబిలిటీ ఉన్న హీరో కాదు అని చెప్పి తన ఫొటోలను పక్కన పెట్టేసేవారని పవన్ వెల్లడించాడు. వాళ్లు అలా చేయడంతో తన ఫొటోలు వేయనపుడు వాళ్ల వెంట ఏం పడుతాం అని తాను మీడియాకు దూరం అయిపోయినట్లు పవన్ వెల్లడించాడు. ఇక మీడియాను కలిసినపుడు సినిమా గురించి ఏం చెప్పాలి అనే విషయంలో కూడా తనకు డైలమా ఉంటుందన్నాడు పవన్.
కథ ఎంత వరకు చెప్పాలి.. ఏం మాట్లాడాలి అన్నది ఎప్పుడూ అయోమయమే అని.. ఒకవేళ సినిమా అద్భుతంగా ఉంటుంది అని చెబితే.. రేప్పొద్దున అలా లేకుంటే తిడతారేమో అని కూడా భయం అని పవన్ చెప్పాడు. ఇదే ప్రసంగంలో తాను టాలీవుడ్లో చాలామంది హీరోల కంటే తక్కువ అని.. వాళ్ల సినిమాలకు జరిగినంత బిజినెస్ తన చిత్రాలకు జరగదని పవన్ తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడ్డం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రసంగంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on July 21, 2025 5:41 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…