Movie News

భలే భలే కలయిక రిపీట్ కానుందా ?

ప్రభాస్ తో ది రాజా సాబ్ రూపంలో జాక్ పాట్ కొట్టిన దర్శకుడు మారుతీ ఆ తర్వాత ఎవరితో చేస్తారనే విషయంలో ఇప్పటిదాకా సరైన క్లారిటీ లేదు. చిరంజీవిని ట్రై చేస్తున్నప్పటికీ కథ కుదరకపోవడంతో ఈ కలయిక లేట్ అవుతోంది. తర్వాత ఏవేవో పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా భలే భలే మగాడివోయ్ కాంబో రిపీట్ కానుందని లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా ఒక కథను ఇద్దరూ ఓకే అనుకున్నారట. ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్ లో బిజీగా ఉన్న న్యాచురల్ స్టార్ నాని ఇంకో ఆరేడు నెలలు పూర్తిగా ఆ ప్రాజెక్టు మీదే ఉండబోతున్నాడు. ఈలోగా కొత్త సినిమాలు లాక్ చేసుకోవాలి.

సుజిత్ తో ప్లాన్ చేసుకున్నది దాదాపు కన్ఫర్మ్ కానీ ఎప్పటి నుంచి మొదలయ్యేది ఇంకా క్లారిటీ లేదు. మారుతీకి స్టార్ స్టేటస్ రావడానికి పునాది వేసిన సినిమాగా భలే భలే మగాడివోయ్ నానికి సైతం పెద్ద  బ్రేక్ ఇచ్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో తన ఇమేజ్ పెంచింది. అప్పటి నుంచి మళ్ళీ ఇద్దరూ కలవలేదు. ఈలోగా నాని రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. రెండు మూడు ఫ్లాపులు చవి చూసినా మారుతీ రాజా సాబ్ ను పట్టేయడం ద్వారా డైరెక్ట్ గా టయర్ 1 లీగ్ లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇది బ్లాక్ బస్టర్ అయ్యిందా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిపోవచ్చు.

ప్రస్తుతానికి ఇది గాసిప్ స్టేజిలోనే ఉంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి తీసేయడానికి లేదు. కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్న నాని మాస్ ఫాలోయింగ్ ని పెంచుకునే పనిలో దసరా, హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ లాంటి హై ఇంటెన్స్ డ్రామాలు చేస్తున్నాడు. మరి హారర్ సినిమాలోనూ కామెడీ టచ్ ఉండేలా చూసుకునే మారుతీ ఈసారి నాని కోసం ఎలాంటి కథ రాసుకున్నాడో చూడాలి. డిసెంబర్ 5 రిలీజ్ కాబోతున్న రాజా సాబ్ బ్యాలన్స్ షూటింగ్ మీద మారుతీ సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. వాయిదా ప్రచారాలకు చెక్ పెడుతూ చెప్పిన డేట్ కే రావడం ఖాయమని ఫిలిం నగర్ టాక్.

This post was last modified on July 19, 2025 7:07 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

1 hour ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago