Movie News

నాగవంశీకి తగిలిన శుక్రవారం షాక్‌లు

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ సంస్థను నడిపించే సూర్యదేవర నాగవంశీ.. ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన నిర్మాతల్లో ఒకరు. అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం.. ఇప్పుడు నాగవంశీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడని చెప్పాడంటే తనెంత సక్సెస్ ఫుల్ అన్నది అర్థం చేసుకోవచ్చు. ఐతే అలాంటి నిర్మాత కూడా బాక్సాఫీస్ ఫలితాలను సరిగా అంచనా వేయలేకపోతున్నాడట. ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఆదరిస్తారో.. దేన్ని తిరస్కరిస్తారో తనకు అర్థం కావడం లేదని ఆయనన్నారు. తన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలతో పాటు వేరే చిత్రాల ఫలితాలు కూడా తనను ఆశ్చర్యపరుస్తున్నట్లు చెప్పారు. తనకు అలా షాకిచ్చిన మూడు సినిమాల ఫలితాల గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

గత ఏడాది తమ ప్రొడక్షన్లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన పట్ల నాగవంశీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సినిమాను తొలి రెండు రోజులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని.. కానీ అందులో ట్రోల్ చేయాల్సిన కంటెంట్ ఏముందో తనకు అర్థం కాలేదని నాగవంశీ తెలిపారు. కానీ అదే సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే గొప్ప ఆదరణ దక్కించుకుందని.. ‘గుంటూరు కారం’ బాగా లేదని ఒక్కరూ అనలేదని.. అలాంటపుడు ముందు ఎందుకు ట్రోల్ చేశారని నాగవంశీ ప్రశ్నించాడు. 

ఇక గత ఏడాది తాను ప్రొడ్యూస్ చేసిన ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధిస్తుందని అనుకున్నానని.. సినిమా చాలా బాగుందని అందరూ అన్నా సరే దానికి ఆశించిన రెవెన్యూ రాకపోవడం తనకు ఇంకా పెద్ద పజిల్ అని నాగవంశీ తెలిపాడు. ఇక టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘కుబేర’ గురించి కూడా నాగవంశీ మాట్లాడాడు. ఈ సినిమా తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలా అనిపించిందని.. కానీ అక్కడ ఆడని ఈ సినిమా తెలుగులో మాత్రం పెద్ద హిట్టయిందని.. ఇది కూడా తనకు షాకే అని నాగవంశీ తెలిపాడు. మనకు అంతా తెలుసు అనుకోవడం తప్పు అని, ప్రేక్షకుల నాడిని ఎవరూ పసిగట్టలేరని నాగవంశీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.

This post was last modified on July 19, 2025 3:18 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Naga Vamsi

Recent Posts

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

2 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

4 hours ago

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

7 hours ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

7 hours ago

సూపర్ న్యూస్… సుబ్బులక్ష్మిగా సాయిపల్లవి ?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…

8 hours ago

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

10 hours ago