బాలీవుడ్ లో అప్పుడప్పుడూ కొన్ని వింతలు జరుగుతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సడన్ సర్ప్రైజ్ ఇస్తాయి. అలాంటిదే నిన్న రిలీజైన సైయారా. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ద్వారా ఆహాన్ పాండే హీరోగా పరిచయమయ్యాడు. ఇతనికో బ్యాక్ గ్రౌండ్ ఉంది. సాహో విలన్లలో ఒకరిగా నటించిన చుంకీ పాండే సోదరుడైన చిక్కీ పాండే కొడుకే ఈ ఆహాన్ పాండే. తండ్రి అసలు పేరు అలోక్ శరద్. షారుఖ్ ఖాన్ అత్యంత సన్నిహితుల్లో ఇతని పేరు ముందుంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి పరిశ్రమకు వచ్చారు. లైగర్ హీరోయిన్ అనన్యకు ఆహాన్ అన్నయ్యవుతాడు.
ఇక అసలు విషయానికి వస్తే సైయారా అంచనాలకు మించి ఓపెనింగ్స్ తెచ్చేసింది. ట్రేడ్ టాక్ ప్రకారం మొదటి రోజు 23 కోట్లకు పైగా వసూలయ్యింది. నిజానికి నిర్మాణ సంస్థ ఇంత ఎక్స్ పెక్ట్ చేయలేదు. కొత్త జంట కాబట్టి జనాలు సినిమాకు వస్తారో రారోననే అనుమానంతో యూత్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు. దాని అవసరం లేకుండా చాలా చోట్ల బుకింగ్స్ ఆశ్చర్యపరిచే రీతిలో బాగుండటం షాక్ ఇస్తోంది. ఆషీకీ 2 ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సైయారాలో మరీ కొత్త కథేం లేదు. ఆ మాటకొస్తే ఆషీకీ 2 ఛాయలు చాలా ఉంటాయి. అయినా సరే 8 మంది సంగీత దర్శకులు అందించిన మ్యూజిక్ బాగా వర్కౌట్ అయ్యింది.
హీరోయిన్ అనీత్ పడ్డకు మంచి పేరే వస్తోంది. చూస్తుంటే సైయారా మెల్లగా వంద నుంచి రెండు వందల కోట్ల మధ్యలో ఫైనల్ కలెక్షన్లు లాక్ చేసేలా ఉందని ట్రేడ్ పండితుల అంచనా. తొలుత ఇది కార్పొరేట్ బుకింగ్స్ వల్ల వచ్చిన నెంబర్లనే ప్రచారం జరిగింది. కానీ ఏపీ తెలంగాణలోని పలు జిల్లా కేంద్రాల్లో కూడా నిన్న ఎక్కువ ఆక్యుపెన్సీలు కనిపించింది దీనికే కాబట్టి సైయారా ప్రభావాన్ని నమ్మొచ్చు. అలాని సినిమా మరీ ఎక్స్ ట్రాడినరిగా లేదు. బలహీనతలున్నాయి అయినా సరే ఎడారిలో కూల్ డ్రింక్ బాటిల్ దొరికినట్టు సరైన కంటెంట్ లేక డ్రైగా ఉన్న నార్త్ బాక్సాఫీస్ సైయారా రూపంలో ఊపిరి పీల్చుకుంటోంది.
This post was last modified on July 19, 2025 12:20 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…