Movie News

ఈ సినిమా… బాక్సాఫీస్ హిట్టేనా..?

ఒక సినిమాకు ప్రి రిలీజ్ బజ్ రావాలంటే అందులో స్టార్లు ఉండాల్సిందే. ఏ బ్యాగ్రౌండ్ లేని కొత్త హీరో హీరోయిన్ నటించిన సినిమాకు హైప్ క్రియేట్ అయి.. అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరగాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఎప్పుడో ఓ సినిమాకు కానీ ఇలా జరగదు. అందులోనూ హిందీలో ఇలాంటివి మరీ అరుదు. కానీ ‘సైయారా’ అనే కొత్త సినిమా ఈ అరుదైన ఫీటే సాధించింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా అనే కొత్త హీరో హీరోయిన్ జంటగా నటించిన లవ్ స్టోరీ ఇది. 

రాజ్, ‘ఆషిఖి-2’, ఏక్ విలన్ లాంటి హిట్ సినిమాలను అందించిన మోహిత్ సూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మొదలైనపుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ మేకింగ్ మధ్యలో పాటలు వదిలిన దగ్గర్నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. టీజర్, ట్రైలర్ కూడా స్ట్రైకింగ్‌గా ఉండడంతో ఒక్కసారిగా సినిమాకు హైప్ పెరిగిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి.

ఇక ఈ రోజు రిలీజైన ‘సైయారా’ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. రివ్యూయర్లందరూ 3.5, 4, 4.5 రేటింగ్స్ ఇస్తున్నారు. హిందీలో రివ్యూల పరంగా మార్కెటింగ్ మాయాజాలం జరుగుతుందనే విషయం వాస్తవమే అయినా.. ఈ సినిమాకు మంచి టాక్ కనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా అంతే ఎగ్జైట్ అవుతున్నారు. చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. 

కథ బలంగా ఉండడం.. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ పండడం.. పాటలు, సినిమాటోగ్రఫీ బాగుండడం.. ఇలా చాలా పాజిటివ్స్ తోడైనట్లున్నాయి. దీంతో తొలి రోజు మేజర్ నార్త్ సిటీస్‌లో ప్యాక్డ్ హౌస్‌లతో నడిచేలా కనిపిస్తోంది ‘సైయారా’. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధించడం కేక్ వాకే అని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. అన్నీ కలిసొస్తే రూ.200 కోట్ల మార్కును కూడా టచ్ చేసే సత్తా ఉందట. మరి తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తుందేమో వేచి చూడాలి.

This post was last modified on July 18, 2025 5:33 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Saiyaara

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

27 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago