ఓ పెద్ద సినిమా మొదలైందంటే.. విడుదల ముందు వరకు దాని కథాంశం బయటికి రాకుండా చూసుకుంటారు. ట్రైలర్లో కూడా అందరూ కథను చెప్పరు. తెర మీద ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని భావిస్తారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం ముందే కథేంటో రివీల్ చేసేస్తుంటారు. గతంలో రాజమౌళి చాలా సినిమాలకు ఇదే శైలిని అనుసరించారు. ఇప్పుడు ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ కూడా జక్కన్న బాటలో పయనించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా బేసిక్ కథేంటో అతను బయట పెట్టేశాడు.
ఇప్పటిదాకా సినిమాల్లో భూలోకం, స్వర్గ లోకం.. యమలోకం.. అంటూ ఏడు లోకాలను చూపించారని.. కానీ తాము ‘విశ్వంభర’లో మొత్తం 14 లోకాలను చూపించబోతున్నామని వశిష్ఠ వెల్లడంచాడు. ఈ 14 లోకాల్లో 7 కింద ఉంటే.. 7 పైన ఉంటాయని.. ఇప్పటిదాకా సినిమాల్లో వివిధ లోకాలను ఎవరికి తోచినట్లు వాళ్లు చూపించారని.. తాము ఈ 14 లోకాలతో పాటు వాటికి మూలమైన సత్య లోకాన్ని చూపించబోతున్నామని వశిష్ఠ వెల్లడించాడు. ఇలా లోకాల చుట్టూ తిరిగే కథల్లో హీరో.. హీరోయిన్ లేదా ఇంకో ఎలిమెంట్‌ను తిరిగి తెచ్చుకోవడానికి వేరే లోకంతో పోరాటం చేస్తాడని.. ‘విశ్వంభర’ కూడా అదే శైలిలో నడుస్తుందని వశిష్ఠ తెలిపాడు.
చిరు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన ఫాంటసీ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి, ‘విశ్వంభర’కు ఏ పోలికా లేదని వశిష్ఠ తెలిపాడు. ‘భైరవద్వీపం’తో కూడా దీనికి సంబంధం లేదని అతను చెప్పాడు. ‘కీలుగుర్రం’ సినిమా తమ చిత్రానికి స్ఫూర్తి అని అతను తెలిపాడు. ఇంకా పాతాళభైరవి లాంటి సినిమాల నుంచి కూడా ఇన్‌స్పైర్ అయినట్లు అతను వెల్లడించాడు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని.. సెట్స్ అనే ఫీలింగ్ కలగకుండా వివిధ లోకాలను చూపించామని వశిష్ఠ తెలిపాడు.
This post was last modified on July 18, 2025 3:16 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…