Movie News

జక్కన్న ఎఫెక్ట్ : జనాల దృష్టిలో జూనియర్

రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో జూనియర్ మీద పబ్లిక్ లో పెద్దగా బజ్ లేదు. నిర్మాణం జరుపుకుని నెలలు గడిచినప్పటికీ ఫైనల్ గా థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. ప్రముఖ మైనింగ్ వ్యాపారవేత్త, ప్రజా ప్రతినిధి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా పరిచయమవుతున్న ఈ మూవీకి ప్రధాన ఆకర్షణలు చాలా ఉన్నాయి. హీరోయిన్ శ్రీలీల వైరల్ వయ్యారి డాన్స్ ఆల్రెడీ వైరలయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ పాట ఒకటి క్లిక్ అయితే ఆటోమేటిక్ గా ఆ చిత్రం మీద బజ్ రావడం గతంలో చాలాసార్లు చూశాం. అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల జనాల దృష్టిలో జూనియర్ పడ్డట్టు అయ్యింది.

రాజమౌళి అతిథిగా రావడం, చాలా గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చి వేడుకకు హాజరు కావడం, శ్రీలీల గ్లామర్ ప్లస్ స్పీచ్, దేవి హుషారైన ప్రసంగం, ఇతర సాంకేతిక నిపుణుల ఎలివేషన్లు మొత్తంగా ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో బాగానే తిరుగుతున్నాయి. బాగా డౌన్ టు ఎర్త్ లా కనిపిస్తున్న కిరిటీ ఆశలన్నీ తన మాతృబాష కన్నడ కంటే తెలుగు మార్కెట్ మీదే ఎక్కువగా ఉన్నాయి. క్లిక్ అయితే ఇక్కడ ఏ స్థాయిలో ఆఫర్లు వస్తాయో అవగాహన ఉన్నట్టుంది. పైగా దేవీశ్రీప్రసాద్ ఏకంగా అల్లు అర్జున్ ఆర్యతో జూనియర్ ని పోల్చడం చూస్తుంటే కంటెంట్ ఏదో సాలిడ్ గానే ఉందని చెప్పాలి.

రేపు టాక్ కొంచెం డీసెంట్ గా వచ్చినా వీకెండ్ లో మంచి నెంబర్లు చూడొచ్చు. లేదూ హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేసుకోవచ్చు. ఎటొచ్చి వచ్చే వారం హరిహర వీరమల్లు ఉన్న నేపథ్యంలో ఏం చేసినా ఏడు రోజుల్లో జరిగిపోవాలి. కొంత కాలంగా నిర్మాణానికి దూరంగా ఉన్న వారాహి చలన చిత్రం సాయి కొర్రపాటి నిర్మించడం వల్లే రాజమౌళి ఈ ఈవెంట్ కి వచ్చారనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు అందరి చూపు రేపు రాబోయే రిపోర్ట్స్ మీదే ఉన్నాయి. పెద్దగా పోటీ లేకపోవడంతో జూనియర్ కు బాక్సాఫీస్ వద్ద మంచి ఛాన్స్ దొరికింది. దాన్ని సరిగ్గా వాడుకుంటే మాత్రం కిరీటి టాలీవుడ్ తొలి అడుగు విజయవంతంగా పడుతుంది.

This post was last modified on July 17, 2025 3:18 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago