ప్రాక్టికల్ గా చూసుకుంటే ప్రేక్షకులు ఎప్పుడూ చిన్నా పెద్దా అనే తారతమ్యం సినిమాల విషయంలో చూపించరు. కంటెంట్ నచ్చిందా టికెట్లు కొంటారు. నచ్చలేదా సాయంత్రానికే జెండా పీకేస్తారు. హీరో సత్యదేవ్ ఇవాళ జరిగిన పరదా రిలీజ్ డేట్ ఈవెంట్ లో మాట్లాడుతూ పెద్ద సినిమాలు రెండు మూడేళ్ళకు వస్తాయని, కానీ చిన్న చిత్రాలు ఇండస్ట్రీని నడిపిస్తాయని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇది నిజమే. వారానికో మూడు నాలుగు రిలీజులు ఉండాలంటే స్టార్ హీరోల వల్ల కాదు. ఛోటా ప్రొడ్యూసర్లు, కొత్త దర్శకులు నడుం బిగించి తక్కువ ఖర్చుతో మూవీస్ తీస్తేనే సాధ్యమవుతుంది. వినడానికి బాగానే ఉంది కానీ ఇక్కడో కోణం చూడాలి.
చిన్న సినిమాలు ఈ మధ్య కాలంలో క్వాలిటీ విషయంలో గాడి తప్పుతున్నాయి. కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేక చేతులు ఎత్తేస్తున్నాయి. మొన్న వచ్చిన ఓ భామ అయ్యో రామా లాంటివి ఈ సంవత్సరంలో చాలానే వచ్చాయి అలాగే కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్లను జనం ఆదరించిన వైనాన్ని మర్చిపోకూడదు. కాకపోతే పెద్ద సినిమాలు తీసుకొచ్చే రెవిన్యూ, వాటికున్న స్పాన్ వేరే లెవెల్. పుష్ప, దేవర, కల్కి, ఆర్ఆర్ఆర్ లాంటివి రికార్డులు బద్దలు కొట్టి వేల కోట్లు వసూలు చేశాయంటే దానికి కారణం విజువల్ గ్రాండియర్ నెస్. కళ్ళు చెదిరే ఖర్చుతో దర్శకులు ఆవిష్కరించిన సరికొత్త ప్రపంచాలు. కాబట్టి లేటవుతాయి.
సత్యదేవ్ అన్నట్టు బడ్జెట్ చిత్రాలు వస్తూనే ఉండాలి. ఒకరకంగా థియేటర్ వ్యవస్థ బ్లాక్ అవ్వకుండా కాపాడేది ఇవే. కానీ నాణ్యత లేనప్పుడు ఎంత డబ్బులు పెట్టినా రిలీజ్ రోజు ఉదయానికే షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి తలెత్తవచ్చు. స్టార్ క్యాస్టింగ్ ఉన్నా లేకపోయినా కంటెంట్ తప్ప ఇంకేదీ జనాన్ని థియేటర్లకు రప్పించలేదు. పైగా అదుపు తప్పుతున్న టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు సామాన్యులను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. వీటి మీద కూడా సీరియస్ గా దృష్టి పెట్టాలి. లేదంటే చేదు ఫలితాలు రిపీటవుతూనే ఉంటాయి. పదే పదే ఈ విషయం గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది.
This post was last modified on July 17, 2025 3:13 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…