అసలే థియేటర్, ఓటిటి మధ్య నెల రోజుల గ్యాప్ కూడా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తోందని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మొత్తుకుంటూ ఉంటే ఇంకా విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు రిలీజవుతున్న కొత్త సినిమాల్లో తమిళ మూవీ డిఎన్ఏ ఉంది. తెలుగులో మై బేబీ పేరుతో డబ్బింగ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ జూన్ 20 విడుదలై మంచి స్పందనే దక్కించుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించాడు. గద్దలకొండ గణేష్ తో మనకు పరిచయమైన అధర్వ మురళి హీరో కాగా అయిదుగురు సంగీత దర్శకులు పాటలు, గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
అంత బాగానే ఉంది కానీ కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో ఈ సినిమా హాట్ స్టార్ ఓటిటిలోకి వచ్చేస్తుంది. అంటే జూలై 18 తెలుగు థియేట్రికల్ రిలీజ్ కాగా జూలై 19 నుంచి అయిదు భాషల్లో ఓటిటిలో చూసేయొచ్చు. ఈ లెక్కన మొదటి ఆట పడిన ఇరవై నాలుగు గంటలోపే డిజిటల్ లో చూసేయొచ్చన్న మాట. ఒప్పందం ప్రకారం నెల రోజుల స్ట్రీమింగ్ కాబట్టి తమిళ వెర్షన్ యథావిధిగా టైం ప్రకారమే వచ్చేస్తోంది కానీ ఎటొచ్చి డబ్బింగ్ హక్కులు కొన్న ఇక్కడి ప్రొడ్యూసర్లే బాగా ఆలస్యం చేశారు. ఆ మధ్య త్రిష ఐడెంటిటీ, శివరాజ్ కుమార్ వేదా కూడా ఇలాగే గంటల వ్యవధిలో ఓటిటికి వచ్చి దెబ్బ తిన్నాయి.
ఇకపై ఇలాంటి విషయాల్లో నిర్మాతలు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే ప్రేక్షకులు బాగా అడ్వాన్స్ అయిపోయారు. ప్రతి వారం కొత్త ఓటిటి కంటెంట్ ఏమొస్తుందో ముందే చూసుకుంటున్నారు. దాని వల్ల థియేటర్ కు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాలు మారుతున్నాయి. అసలే బజ్ లేని సినిమాలకు మొదటి రోజే షోలు క్యాన్సిల్ అవుతున్న దాఖలాలు ప్రతి శుక్రవారం కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటిది ఒక డబ్బింగ్ మూవీకి ఇలా జరగడం ఎలాంటి ఫలితం ఇస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. రేపు అయిదారు రిలీజులు ఉన్న నేపథ్యంలో ఇంత కాంపిటీషన్ లో మై బేబీ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.
This post was last modified on July 17, 2025 1:08 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…