బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘భజరంగి భాయిజాన్’ ఒకటి. ‘బాహుబలి’ రిలీజైన కొన్ని వారాలకే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకుంది. బాలీవుడ్లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది. సల్మాన్ ఖాన్ కెరీర్లో కంటెంట్ పరంగా కూడా బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు. ఈ సినిమాకు సీక్వెల్ తీయడం గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. ఈ మూవీకి కథ అందించిన విజయేంద్ర ప్రసాదే.. సీక్వెల్ కోసం ఒక లైన్ రెడీ చేశారు. దాన్ని గతంలో సల్మాన్ ఖాన్‌కు చెబితే.. ఆయన ఆసక్తి ప్రదర్శించారని కూడా అన్నారు. కానీ తర్వాత ఏమైందో తెలియదు.
ఐతే ఇప్పుడు దర్శకుడు కబీర్ ఖాన్ ‘భజరంగి భాయిజాన్’ సీక్వెల్ గురించి మాట్లాడాడు. ఆ సినిమా కచ్చితంగా తీస్తామని ప్రకటించారు. కానీ అందుకోసం తొందరపడమని స్పష్టం చేశాడు. ‘‘అన్ని సినిమాల సీక్వెల్స్, ఫ్రాంఛైజీలు మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. అలాంటి సమయంలో భజరంగి భాయిజాన్ సీక్వెల్ చేయడం మంచి ఆలోచనే అవుతుంది. గత రెండు దశాబ్దాల్లో అత్యంత ఆదరణ పొందిన చిత్రాల్లో ఒకటైన చిత్రం ఇది. కానీ ఆ సినిమా క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి, స్వప్రయోజనాల కోసం సీక్వెల్ తీయాలనుకుంటే కరెక్ట్ కాదు.
మేం సీక్వెల్ చేస్తే.. అది ఫస్ట్ పార్ట్ కంటే గొప్పగా ఉండాలి. అలాంటి కథ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు సినిమాను మొదలుపెడతాం. అది ఈ ఏడాది కావచ్చు. వచ్చే ఏడాది కావచ్చు. ఇంకా టైం పట్టొచ్చు. కానీ కథ గొప్పగా తయారైనపుడే సినిమా మొదలవుతుంది’’ అని కబీర్ ఖాన్ చెప్పారు. మరి అంత గొప్ప కథను మళ్లీ విజయేంద్ర ప్రసాదే ఇస్తారా.. లేక కబీర్ వేరే రచయితల సాయంతో స్క్రిప్టు రెడీ చేస్తారా అన్నది చూడాలి.
కబీర్ మాటల్ని బట్టి చూస్తే ఈ సీక్వెల్ అయితే కచ్చితంగా ఉంటుందన్నమాట. పాకిస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ తప్పిపోయిన ఒక చిన్నారిని ఒక యువకుడు తిరిగి ఆ దేశానికి చేర్చడం మీద ‘భజరంగి భాయిజాన్’ నడుస్తుంది. కానీ ఈ సినిమా వచ్చినపుడు ఇండియా-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు వేరు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఈ స్థితిలో ఈ సీక్వెల్ చేయడం అంత తేలికైతే కాదు.
This post was last modified on July 16, 2025 11:11 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…