లెజెండరీ హీరో అండ్ డైరెక్టర్ కమల్ హాసన్, శంకర్ లు ఎంత బ్యాడ్ ఫేజ్ లో ఉన్నారో చెప్పనక్కర్లేదు. ఇండియన్ 2, థగ్ లైఫ్ డిజాస్టర్లతో లోకనాయకుడు డీలా పడగా భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ తో ఇండియన్ స్పిల్బర్గ్ తన భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసుకున్నారు. వీళిద్దరి కలయికలో పెండింగ్ ఉండిపోయిన సినిమా ఒకటుంది. అదే ఇండియన్ 3. ఎప్పుడు ఎక్కడ రిలీజవుతుందో ఎవరికీ తెలియదు. కొందరు థియేటర్ అన్నారు, మరికొందరు ఓటిటి అన్నారు ఇంకొకరు అసలు వెలుగులోకి రాదన్నారు. ఇంత సందిగ్ధం మధ్యలో ఈ ప్యాన్ ఇండియా మూవీ మోక్షానికి రజనీకాంత్ చొరవ తీసుకున్నట్టు చెన్నై టాక్.
తనకు బాగా కావాల్సిన లైకా ప్రొడక్షన్స్, శంకర్ తరఫున కమల్ హాసన్ తో మాట్లాడి వీలైనంత వేగంగా దీన్ని బయటికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసుకోమని ముగ్గురితో మాట్లాడి ఒప్పించారట. బ్యాలన్స్ ఉన్న షూటింగ్, రీ రికార్డింగ్, డబ్బింగ్ తదితర కార్యక్రమాలకు ఎలాంటి రెమ్యునరేషన్ డిమాండ్ చేయకూడదనే నిబంధనకు కమల్, శంకర్ ఇద్దరూ అంగీకరించినట్టు వినికిడి. రిలీజయ్యాక ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ముందు వచ్చిన నష్టాలన్నీ పోను ఎంతైతే మిగులుతుందో దాని నుంచి పారితోషికాలు తీసుకోవచ్చట. అధికారికంగా ఇదంతా బయటకు చెప్పలేదు కానీ కోలీవుడ్ వర్గాల్లో టాక్ ఉంది.
నిజానికి అసలైన కథ ఇండియన్ 3లోనే ఉంది. కేవలం సీక్వెల్ క్రేజ్ మీద ఎక్కువ డబ్బు చేసుకునే ఉద్దేశంతో ఇండియన్ 2ని చుట్టేయడం దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. ఫలితంగా మూడో భాగం మీద కొంచెం కూడా క్రేజ్ లేకుండా పోయింది. ఇప్పుడు మార్గం సుగమం కావడం అభిమానులకు శుభ వార్తే. సేనాపతి ఉగ్రవాదిగా మారడానికి కారణాలు, బ్రిటిషర్లతో అతను చేసిన యుద్ధాలు తదితర చాలా అంశాలు ఇండియన్ 3లో ఉండబోతున్నాయి. అనిరుద్ రవిచందర్ అందించిన మెయిన్ సాంగ్స్ ఇందులో చూడచ్చు. కమల్ కు జోడిగా కాజల్ అగర్వాల్ దర్శనం కూడా పార్ట్ 3లోనే జరగనుంది. చూద్దాం ఇదెంతవరకు నిజమో.
This post was last modified on July 16, 2025 3:47 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…