అక్టోబర్ 31 విడుదల కాబోతున్న బాహుబలి ది ఎపిక్ రన్ టైం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. బిగినింగ్, కంక్లూజన్ రెండు భాగాలు కలిపి సింగల్ పార్ట్ గా రిలీజ్ చేయబోతున్న రాజమౌళి బృందం ఎస్ఎస్ఎంబి 29కి బ్రేక్ దొరికినప్పుడంతా ఈ పని మీదే ఉన్నారు. బుక్ మై షోలో దీని నిడివి ఏకంగా 5 గంటలకు పైగా చూపించడం కన్ఫ్యూజన్ కి దారి తీసింది. నిన్న జరిగిన కొత్తపల్లిలో ఒకప్పుడు ప్రెస్ మీట్ లో భల్లాల దేవ దగ్గుబాటి రానా మాట్లాడుతూ ఎంత లెన్త్ ఉంటుందనే దాని గురించి తనకు తెలియదని, రాజమౌళినే వివరాలు వెల్లడిస్తారని చెప్పి ఆ టాపిక్ ని అక్కడితో ముగించేశాడు.
ఇన్ సైడ్ టాక్ అయితే బాహుబలి ది ఎపిక్ ని మూడున్నర గంటలకు కొంచెం అటుఇటుగా ఫైనల్ వెర్షన్ లాక్ చేసే ప్లానింగ్ జరుగుతోంది. యానిమల్, పుష్ప 2 ఈ నిడివితో థియేట్రికల్ వర్కౌట్ అయ్యాయి కాబట్టి ఆ దిశగా వెళ్తున్నారట. నిజానికి ఈ నిడివికి కుదించడం అంత సులభం కాదు. పైగా డిలీట్ చేసిన సీన్లు కొన్ని కలుపుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఎడిటింగ్ టీమ్ కి ఇది పెద్ద సవాల్ కానుంది. రీ రిలీజుల చరిత్రలో ఇప్పటిదాకా ఏ సినిమా వసూలు చేయనంత భారీ కలెక్షన్లు బాహుబలి ది ఎపిక్ స్వంతం చేసుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టే హక్కుల కోసం డిమాండ్ పెరుగుతోందట.
ది ఎపిక్ వెర్షన్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగుతారని ఫిలిం నగర్ టాక్. మార్కెటింగ్ చేసుకోవడంలో సిద్ధహస్తుడైన జక్కన్న ఈసారి ఎలాంటి స్ట్రాటజీ వేస్తారో చూడాలి. తన యమదొంగ, సింహాద్రి, విక్రమార్కుడు, సై రీ రిలీజ్ సమయంలో మౌనంగా ఉన్న రాజమౌళి ఈసారి బాహుబలి బాధ్యతను భుజాల మీద ఎత్తుకోబోతున్నారట. నిడివి విషయంలో ఆయన ఇచ్చిన సూచనల మేరకే వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. ది రాజా సాబ్ రిలీజ్ కే సరిగ్గా 35 రోజుల ముందు వస్తున్న బాహుబలి ఎపిక్ కి ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates