హిట్టు కోసం హీరోకన్నా ఎక్కువగా అభిమానులు ఎదురు చూస్తున్న రవితేజ మాస్ జాతర వచ్చే నెల ఆగస్ట్ 27 రాబోతున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీలో ఈసారి ఎలాంటి మార్పు ఉండటం లేదు. నిన్నా మొన్నటి దాకా కొంచెం సమస్యగా ఉన్న శ్రీలీల డేట్లు దొరకడంతో టీమ్ బ్యాలన్స్ షూటింగ్ ని పూర్తి చేసేందుకు పరుగులు పెడుతోంది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న అనార్కలి (ప్రచారంలో ఉన్న టైటిల్) లో బిజీగా ఉన్న మాస్ రాజా త్వరలోనే మాస్ జాతర సెట్స్ లో అడుగు పెట్టి గుమ్మడికాయ కొట్టేస్తాడు. సామజవరగమన రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం మాస్ జాతరలో అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ సరైన మోతాదులో దట్టించుకుని తీస్తున్నారట. కామెడీ, యాక్షన్, ఎలివేషన్, వయొలెన్స్ ఏదీ మిస్ కాకుండా భాను ఇచ్చిన ట్రీట్ మెంట్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. టీజర్లో పోలీస్ ఆఫీసర్ గా చూపించారు కానీ అంతకు మించిన డిఫరెంట్ షేడ్స్ తెరమీద చూసినప్పుడు షాక్ ఇస్తాయని సమాచారం. ధమాకాలో శ్రీలీలతో కలిసి డాన్స్ కిక్ ఇచ్చిన రవితేజ మరోసారి ఆ మేజిక్ రిపీట్ చేయడం ఖాయమేనని యూనిట్ సభ్యుల మాట. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ కాంబోకి ఏ మాత్రం తీసిపోని రీతిలో వచ్చిందని, మరో బెస్ట్ ఆల్బమ్ అవుతుందని టాక్.
ధమాకా, వాల్తేరు వీరయ్య తప్ప మిగిలినవన్నీ ఫెయిల్యూర్స్ చవి చూసిన రవితేజ ఈసారి టార్గెట్ తప్పకూడదనేది అభిమానుల కోరిక. నిర్మాత నాగవంశీ చెబుతున్న దాని ప్రకారం చూస్తుంటే నమ్మకం కలిగించేలానే ఉంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ ఇలా వరస వైఫల్యాల్లో ఉన్న రవితేజ కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం వెనుక కారణం మాస్ జాతరలో ఫన్ ఎలిమెంట్సే. విక్రమార్కుడు, కృష్ణ, క్రాక్, కిక్ క్యారెక్టరైజేషన్లను కలిపితే ఎలా ఉంటుందో మాస్ జాతరలో హీరో పాత్ర అంతకు మించే ఉంటుందని ఇన్ సైడ్ న్యూస్. అదే నిజమైతే మటుకు రవితేజ ఫ్యాన్స్ కు ఆగస్ట్ 27 ఫుల్ మీల్స్ దొరకడం ఖాయం.
This post was last modified on July 16, 2025 11:44 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…