హరిహర వీరమల్లు విడుదలవుతున్న వేళ మొదట దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన దర్శకుడు క్రిష్ ఇప్పుడు ప్రమోషన్ల టైంలో బయటికి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి చేసింది జ్యోతి కృష్ణే అయినప్పటికీ క్రిష్ కాంట్రిబ్యూషన్ ని తక్కువ చేసి చూడలేం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మీద ఆయన మూడు సంవత్సరాలు పని చేశారు. స్క్రిప్ట్ స్టేజి నుంచి దానికో రూపం వచ్చే దాకా సర్వం చూసుకున్నారు. ప్రాధమిక అవగహన క్రిష్ కే ఎక్కువ ఉంటుంది. కానీ రిలీజ్ ఇంకో ఎనిమిది రోజులు ఉండగా తను ఎక్కడ కనిపించకపోవడం అభిమానులు కొంత లోటుగానే ఫీలవుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన కొన్ని కోణాలున్నాయి. క్రిష్ ఇప్పుడు ఇంటర్వ్యూలు గట్రా ఇస్తే ఏదో ఒక రూపంలో హైలైట్ అవుతాడు. అదే జరిగితే జ్యోతి కృష్ణ పడ్డ కష్టం సైడ్ ట్రాక్ అయ్యే రిస్క్ లేకపోలేదు. నిర్మాతగా కన్నా ఒక తండ్రిగా ఏఎం రత్నం దాన్ని కోరుకోరు. పైగా క్రిష్ ఎందుకు వెళ్లారనే దాని మీద ఆయన పలు ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు జ్యోతికృష్ణ సైతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ లో క్రిష్ ప్రస్తావన తెచ్చి తనకు మంచి పునాది వేసి ఇచ్చారని కృతజ్ఞతలు చెప్పాడు. సో అక్కడితో కథ ముగిసింది. క్రిష్ రావడం జరిగే పనిలా లేదు. ఒకవేళ వస్తే మాత్రం స్వీట్ సర్ప్రైజ్.
ఇది పక్కనపెడితే క్రిష్ మీద బండెడు బరువు మరొకటి ఉంది. అనుష్క ఘాటీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. పైగా ఈ ఏడాది స్లాట్లన్నీ ప్యాన్ ఇండియా మూవీస్ దాదాపు తీసేసుకున్నాయి. వీలైనంత త్వరగా ఘాటీకి ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయకపోతే ఓటిటి నుంచి ఒత్తిడి వస్తుంది. ఇదంతా క్రిష్ దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో బయటికి వచ్చి హరిహర వీరమల్లు గురించి కబుర్లు చెప్పే మూడ్, తీరికా రెండు ఉండకపోవచ్చు. వచ్చినా రాకపోయినా క్రిష్ కష్టాన్ని ఫ్యాన్స్ మరీ తేలిగ్గా మర్చిపోరు.
This post was last modified on July 15, 2025 9:53 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…