ఇంకో తొమ్మిది రోజులు గడిస్తే పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చేస్తారు. హరిహర వీరమల్లు రాకకు రంగం సిద్ధమవుతోంది. బిజినెస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఇంకా పూర్తి కావాల్సిన థియేటర్ అగ్రిమెంట్లు చాలానే ఉన్నాయట. నిర్మాత ఏఎం రత్నం వీటిలో తల మునకలై ఉన్నారు. క్లియర్ చేయాల్సిన ఫైనాన్సులను తగ్గించుకోవాలంటే అడ్వాన్సులు రావాలి. కానీ కోరుకున్నంత మొత్తం వేగంగా రాకపోవడమే సమస్య. ఎంత పవన్ సినిమా అయినా బజ్ పరంగా హరిహర వీరమల్లు ఓజి స్థాయిలో లేదన్నది వాస్తవం. ఓజి కోసం ఎగబడుతున్న బయ్యర్లు వీరమల్లు మీద అంతే స్థాయిలో ఆసక్తి చూపించడం లేదన్నది బహిరంగ రహస్యం.
ఇప్పుడు వీరమల్లు బృందం ముందున్న తక్షణ కర్తవ్యాలు కొన్నున్నాయి. చివరి నిమిషం దాకా ఆర్థిక ఒత్తిళ్లు రాకుండా చూసుకోవడం. ఎందుకంటే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు, రోజువారీ షోలు, స్క్రీన్ల పంపకాలు లాంటి పంచాయితీలు తలనెప్పిగా మారకూడదంటే కనీసం రెండు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోవాలి. ఈ మధ్య టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఏపీ జిఓలు కొంత ఆలస్యంగా వస్తున్నాయి. దాని వల్ల ఆన్ లైన్ టికెట్ అమ్మకాలు రిలీజ్ కు కొన్ని గంటల ముందు మాత్రమే మొదలుపెట్టే పరిస్థితి తలెత్తింది. వీరమల్లు ఓపెనింగ్స్ లో పెద్ద నెంబర్లు రావాలంటే లేట్ బుకింగ్స్ లేకుండా చూసుకోవాలి.
సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో తక్కువ టైంలోనే ఎక్కువ పబ్లిసిటీ జరిగేలా చూసుకోవాలి. ఈ నెల 20న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంటనే టాక్ వచ్చింది కానీ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజమౌళి, త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా కన్ఫర్మ్ అయినట్టే. ఇంకెవరు వస్తున్నారో పేర్లు తెలియాల్సి ఉంది. పవన్ ఉంటే ప్రత్యేకంగా ఇంకే స్టార్ హీరోలు అవసరం లేదు కాబట్టి వేరే హీరోలు రాకపోవచ్చు. హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఇందులో పాల్గొనబోతోంది. థియేటర్ బిజినెస్ ఎంతకు క్లోజ్ చేశారనే వివరాలు రేపో ఎల్లుండో తెలియనున్నాయి.
This post was last modified on July 15, 2025 3:28 pm
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…