‘పెళ్ళిసంద-డి’ అనే చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి చూస్తుండగానే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల. మహేష్ బాబు లాంటి టాప్ స్టార్‌కు ఆమె జోడీగా నటించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనూ నటిస్తోంది. ఈ రేంజ్ హీరోయిన్ ఫిలిం బ్యాగ్రౌండ్ లేని ఒక కొత్త హీరో సరసన సినిమా చేయడం విశేషమే. ఆ చిత్రమే.. జూనియర్. కర్ణాటక రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న ‘జూనియర్’లో శ్రీలీల కథానాయిక అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆమె తన కెరీర్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ఆ మొత్తం రూ.2.5 కోట్లట. ఈ సినిమా ముందు వరకు శ్రీలీల కోటి-కోటిన్నర మధ్య పారితోషకం పుచ్చుకుంది. ఈ సినిమాకు మాత్రం దాదాపు డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి ఎంత బిగ్ షాట్ అన్నది అందరికీ తెలుసు. ఓబులాపురం మైనింగ్‌తో వేల కోట్ల సంపాదిచారాయన. ఇంట్లో అన్నం తినే కంచం సహా అన్నీ బంగారంతో చేయించుకునే స్థాయికి ఎదిగారు. అలాంటి వ్యక్తి తన కొడుకును హీరోను చేస్తున్నారంటే డబ్బులు ఏ స్థాయిలో ఖర్చు చేస్తారో చెప్పాల్సిన పని లేదు.
శ్రీలీల, రవిచంద్రన్, జెనీలియా.. ఇలా పేరుమోసిన కాస్టింగ్ పెట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్, కె.కె.సెంథిల్ కుమార్ లాంటి పెద్ద టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేశారు. వీళ్లందరికీ భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాకు ఒప్పించారన్నది స్పష్టం. ఈ సినిమా పబ్లిసిటీ మీద కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో పబ్లిసిటీ చేస్తున్న సినిమా మరొకటి లేదని చెప్పాలి. ఈ సినిమా టీజర్, సాంగ్స్ బాగానే జనాల్లోకి వెళ్లాయి. త్వరలోనే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. కన్నడ వెర్షన్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు శివరాజ్ కుమార్ అతిథిగా రాగా.. తెలుగు వెర్షన్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ శుక్రవారమే ‘జూనియర్’ కన్నడ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 14, 2025 3:52 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…