ఈ వారం విడుదలవుతున్న కొత్త సినిమాల్లో జూనియర్ ఒకటే కాస్త చెప్పుకోదగినది. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా పరిచయమవుతున్న ఈ మూవీకి తక్కువ బడ్జెట్ కాలేదు. క్యాస్టింగ్ నుంచి టెక్నికల్ క్రూ దాకా చాలా పెద్ద సెటప్ పెట్టుకున్నారు. హీరోయిన్ గా శ్రీలీలకు రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు అనఫీషియల్ టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ముఖ్యమైన పాత్రలో బొమ్మరిల్లు జెనీలియా, కేకే సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం వీటికి ఎంత ఖర్చయి ఉంటుందో చెప్పనక్కర్లేదు. కిరీటి తెలుగు మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. ఇంటర్వ్యూల ద్వారా అటెన్షన్ తీసుకుంటున్నాడు.
ఇదంతా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కి జనాన్ని ఫుల్ చేయడం అంత సులభం కాదు. కేవలం శ్రీలీల కోసం హౌస్ ఫుల్స్ పడిపోవు. వైరల్ వయ్యారి సాంగ్ కొంత మేరకు ఆ బాధ్యతను నెరవేర్చినా భారీ నెంబర్లు చూడలేం. ఖచ్చితంగా ఓ రేంజ్ టాక్ రావాల్సిందే. అప్పుడు కానీ జనం టికెట్లు కొనరు. అసలే వారం గ్యాప్ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తోంది. దాన్ని చూద్దామని ఫిక్స్ అయిన ఆడియన్స్ జూనియర్ మీద ఆసక్తి చూపించకపోవచ్చు. అది బ్రేక్ చేయాలంటే టాక్స్, రివ్యూస్ చాలా కీలకం కానున్నాయి. కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శివరాజ్ కుమార్ ని గెస్టుగా తీసుకురావడం చాలా ప్లస్ అయ్యింది.
ఇప్పుడు తెలుగులో ఎవరిని తెస్తారనేది ఆసక్తికరంగా మారింది. కిరీటికి బాగా ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ ని ట్రై చేస్తున్నారట కానీ తను రావడం డౌట్ గానే ఉంది. కిరీటికి స్టార్ బ్యాక్ గ్రౌండ్ లేదు. తండ్రికి బిజినెస్ ప్లస్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కానీ అది కూడా కేసులతో ముడిపడినది కావడంతో ఆ కోణం అంతగా ఉపయోగపడదు. తెలుగు బాగా మాట్లాడే కిరిటీకి డెబ్యూ సక్సెస్ చాలా కీలకం. అసలే కన్నప్ప నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ డ్రైగా ఉంది. ఈ అవకాశాన్ని కనక సరిగ్గా వాడుకుంటే డీసెంట్ వసూళ్లతో గట్టెక్కొచ్చు. లేదూ సూపర్ హిట్ టాక్ వచ్చిందా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు కూడా రావొచ్చు.
This post was last modified on July 14, 2025 3:39 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…