కేవలం పది అంటే పదే రోజుల్లో హరిహర వీరమల్లు విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సిఎం అయ్యాక చేసిన సినిమా కావడంతో అభిమానుల సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. అయితే సాధారణ ప్రేక్షకుల్లో అంత బజ్ ఉందా అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ థియేటర్ బిజినెస్ కు సంబంధించి క్లియర్ పిక్చర్ రావడం లేదు. ఫలానా డిస్ట్రిబ్యూటర్ ఫలానా ఏరియాలు కొన్నారనే లీకులు సోషల్ మీడియాలో వస్తున్నాయి తప్పించి ఫైనల్ గా ఎంత నెంబర్స్ దగ్గర క్లోజ్ అయ్యాయనేది బయటికి రావడం లేదు. నిర్మాత ఏఎం రత్నంకు రావాల్సిన అడ్వాన్సులు చాలానే ఉన్నాయట.
అవి పూర్తిగా చేతికి అందితే ఫైనాన్సులు కట్టడానికి దారి దొరుకుతుంది. ఇదిలా ఉంచితే హిందీ వెర్షన్ కు సంబంధించి ప్రమోషన్ పెద్దగా చేయకపోవడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హైందవ ధర్మం పరిరక్షణ కోసం పోరాడిన వీరమల్లు కథ ఉత్తరాది ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని, అంత కంటెంట్ ఇందులో ఉందని తెలిసేలా పబ్లిసిటీ చేస్తేనే జనాలు వస్తారని ఆశిస్తున్నారు. కార్తికేయ 2, కాంతార తరహాలో దీన్ని చూస్తారని గుడ్డి నమ్మకం పెట్టుకోవడం సరికాదు. ఎలాంటి అంచనాలు లేకుండా సర్ప్రైజ్ ఇచ్చిన ప్యాకేజీలవి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ముందు గానే ఏవేవో లెక్కలతో పబ్లిక్ వస్తారు.
టాక్ ఖచ్చితంగా అదిరిపోతుందనే నమ్మకంతో రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణలు ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ తో పాటు వీకెండ్ మొత్తం స్ట్రాంగ్ రన్ రావాలంటే ప్రమోషన్ల గేరు మార్చాలి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రామిసింగ్ గానే ఉన్నాయి. నార్త్ లో ఆ స్థాయి స్పందన కనిపించాలి. ఎలాగూ హిందీలో ఈ నెలలో చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు. సో సరిగా వాడుకుంటే భారీ కలెక్షన్లు రాబట్టవచ్చు. ముంబైలో ఒక ఈవెంట్ ఉందని, దానికి యోగి ఆదిత్యనాధ్ లాంటి ఎందరో బిజెపి సిఎంలు, ప్రముఖులు వస్తారనే ప్రచారం జరిగింది కానీ ఎంతవరకు నిజమవుతుందో, అసలీ పది రోజుల్లో సాధ్యమవుతుందో లేదో చూడాలి.
This post was last modified on July 14, 2025 12:44 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…