రాజ్ కుమార్ రావుకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గౌరవం ఉంది. విలక్షణమైన కథలను ఎంచుకుని రొటీన్ కి దూరంగా ఉంటాడని విమర్శకులు సైతం మెచ్చుకుంటారు. గత ఏడాది శ్రీకాంత్ లో అంధ వ్యాపారవేత్తగా అద్భుతంగా నటించడం చూశాం. దీనికి జాతీయ అవార్డు వస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. అంతకు ముందు న్యూటన్ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ఎక్స్ పీరియన్స్ తనకు నటన పరంగా ఎన్నో మెట్లు పైకెక్కించింది. హిట్ ది ఫస్ట్ కేస్ ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజులకు తట్టిన మొదటి ఆప్షన్ రాజ్ కుమార్ రావే.
అది బాక్సాఫీస్ దగ్గర ఆడకపోవడం వేరే విషయం. తాజాగా అతను మాలిక్ గా థియేటర్లలో అడుగు పెట్టాడు. ట్రైలర్ గట్రా చూసి ఇదేదో మాంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనరని బయ్యర్లు వసూళ్ల మీద నమ్మకం పెట్టుకున్నారు. తీరా చూస్తే ఎప్పుడో అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి గ్యాంగ్ స్టర్ల కథలన్నీ కలిపి దానికి మాలిక్ అనే పేరు పెట్టి జనం మీదకు వదిలాడు దర్శకుడు పులకిత్. దుర్మార్గుల వల్ల తండ్రి చనిపోతే దీపక్ అనే యువకుడు ఆయుధం పట్టి మాలిక్ గా మారతాడు. అలహాబాద్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నాక శత్రువులు అతన్ని లేపేయాలని చూస్తారు. తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు.
బాషా, కెజిఎఫ్, పుష్ప, యానిమల్ తదితర సినిమాలను ఇన్స్ పిరేషన్ గా తీసుకున్న పులకిత్ తాను ఎంత అవుట్ డేటెడ్ కంటెంట్ రాసుకున్నాడో స్క్రిప్ట్ దశలోనే గుర్తించి ఉంటే బాగుండేది. రొటీన్ వద్దని నిర్మొహమాటంగా జనం చెబుతున్నా సరే ఇలాంటి మాలిక్ లను కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు తీస్తారో అర్థం కాదు. అందులోనూ రాజ్ కుమార్ లాంటి వాళ్ళు డార్క్ బ్యాక్ డ్రాప్స్ కి సెట్ కారు. అదేమీ ఆలోచించకుండా నిర్మాత దొరికాడు కదాని ఇలాంటి రొట్ట సినిమాలు వదిలితే నిర్మాతలు తడిగుడ్డలు వేసుకోవాల్సిందే. అయినా రాజ్ కుమార్ రావు లాంటి విలక్షణ హీరోలను వృథా చేసుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు.
This post was last modified on July 11, 2025 5:15 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…