పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రభాస్ గురించి చెబుతున్నాం సరే… బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా చేయకుండానే తమకు కూడా నార్త్ ఇండియాలో పిచ్చ ఫాలోయింగ్ వుందని తమ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు యూట్యూబ్‍లో వస్తోన్న వ్యూస్ చూపిస్తున్నారు మన హీరోలు. అల్లు అర్జున్, రామ్, బెల్లంకొండ శ్రీనివాస్, రవితేజ లాంటి కొందరు తెలుగు హీరోల సినిమాలు హిందీలోకి డబ్ అయితే యూట్యూబ్‍లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేస్తుంటాయి.
అయితే ఇవన్నీ యూట్యూబ్‍లో ఫ్రీగా పెట్టే వీడియోలకు వస్తోన్న వ్యూస్. వీళ్లు స్ట్రెయిట్ సినిమాలు చేస్తే నార్త్ ఆడియన్స్ టికెట్ కొనుక్కుని థియేటర్లకు వస్తారా అంటే తెలీదు. అది తెలుసుకోవడానికి అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రాన్ని అన్ని ముఖ్య భాషలలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు. రామ్ కూడా పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆలోచనను పలువురు దర్శకుల వద్ద వెలిబుచ్చాడట.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అయితే అచ్చంగా హిందీ సినిమానే చేయాలని ఛత్రపతి రీమేక్ మీద దృష్టి పెట్టాడు. ప్రభాస్ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్.’తో ఎన్టీఆర్, చరణ్ ఎలాగో పాన్ ఇండియా స్టార్లు అవుతారని అభిమానులు భావిస్తున్నారు. ఇక రాజమౌళి సాయం లేకుండా… మన హీరోలు వెళ్లి హిందీలో సినిమాలు చేస్తే యూట్యూబ్ ఆడియన్స్ అంతా థియేటర్లకు వస్తారో లేదో వేచి చూడక తప్పదు.
This post was last modified on November 16, 2020 4:43 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…