అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ఇవాళ అనుష్క ఘాటీ థియేటర్లలో విడుదలయ్యేది. ఇది వస్తుందనే నమ్మకంతో జూన్ నెలాఖరు దాకా బయ్యర్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే మళ్ళీ వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విఎఫ్ఎక్స్ అంటూ యువి సంస్థ కారణాలు చెబుతోంది కానీ మళ్ళీ ఎప్పుడు రిలీజనేది మాత్రం చెప్పడం లేదు. నిన్న జరిగిన బాహుబలి 10 ఇయర్స్ రీ యునియన్ వేడుకైనా వచ్చి ఉంటే బాగుండేది కానీ స్వీటీ దర్శనం జరగలేదు. ప్రభాస్, రాజమౌళి పర్సనల్ గా రిక్వెస్ట్ చేసినా వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేనని బదులు చెప్పడంతో తను లేకుండానే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైం నుంచే అనుష్క బయటికి రావడమనేది పెద్ద టాస్క్ అయిపోయింది. ఆ సినిమా ప్రమోషన్లలో కూడా అనుష్క నేరుగా కనిపించలేదు. ఏదో ఇంటర్వ్యూ చేసినా దాని వీడియో వదల్లేదు. సినిమా హిట్టయిపోయింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే సోషల్ మీడియాలో లేనిపోని డిస్కషన్ జరిగేది. ఇప్పుడు ఘాటీ వచ్చే టైం అయ్యింది. కెరీర్ లో మొదటిసారి లేడీ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించడం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటిదాకా చిన్న టీజర్, లిరికల్ సాంగ్ తప్ప ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. అవి కూడా పెద్దగా బజ్ పెంచలేకపోయాయి.
అసలు అనుష్క బయటికి రాకపోవడం గురించి రకరకాల కథనాలు వస్తున్నా వాటికి క్లారిటీ రావాలంటే తను కనీసం ఒక్కసారైనా ప్రెస్ మీట్స్ లాంటి వాటిలో పాల్గొనాలి. ఘాటీ టైటిల్ రోల్ తనదే కాబట్టి ఈసారి తప్పుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఏదో ఒక ఈవెంట్ కైనా రావాల్సి ఉంటుంది. భాగమతి తర్వాత విపరీతమైన గ్యాప్ తీసుకుంటున్న అనుష్క సైరా నరసింహారెడ్డిలో కాసేపు కనిపించి తళుక్కుమంది. ఒప్పుకుంటే తనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ ఎటొచ్చి తనే సిద్ధంగా లేదు. మలయాళం మూవీ కథనార్ కూడా విడుదలలో జాప్యం ఎదురుకోవడం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on July 11, 2025 2:23 pm
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…