Movie News

ప్యారడైజ్ వెనక్కు తగ్గడం లేదు

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ ఊపందుకుంది. ఆ మధ్య పలు కారణాల వల్ల చిన్న బ్రేక్ ఇచ్చినప్పటికీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పీడ్ పెంచేశాడు. వచ్చే ఏడాది మార్చి 26 విడుదల తేదీ మారొచ్చనే వార్తల నేపథ్యంలో ఇవాళ లాంచ్ చేసిన విలన్ రాఘవ్ జుయల్ టీజర్ లో మరోసారి డేట్ ని స్పష్టంగా పేర్కొంటూ క్లారిటీ ఇవ్వడంతో నాని ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు. కేవలం ఒక రోజు గ్యాప్ తో రామ్ చరణ్ పెద్ది మార్చి 27 రానుండటంతో ఈ క్లాష్ గురించి ఇండస్ట్రీలోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.

ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆలోగా ఏమైనా జరగొచ్చనే తరహాలో ఇంకో ఆరేడు నెలలు ఆగితే కానీ ఏ విషయం నిర్ధారణగా చెప్పలేం. గత కొన్నేళ్లలో ముందు చెప్పిన తేదీకి కట్టుబడ్డ ప్యాన్ ఇండియా మూవీ ఒక్కటి కూడా టాలీవుడ్ లో లేదు. కనీసం రెండు మూడు వాయిదాలు లేనిదే నిర్మాతలు హీరోలు ముందుకెళ్లడం లేదు. కానీ ది ప్యారడైజ్ అలా కాదు. అనౌన్స్ మెంట్ వీడియోలో ముందు స్లాట్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ పెద్ది లైన్ లోకి వచ్చింది. ఒకవేళ పరస్పరం తలపడాల్సి వస్తే రెండూ బాగుంటే బ్లాక్ బస్టరవుతాయనే నమ్మకాన్ని హిట్ 3 ఇంటర్వ్యూలలో నాని వ్యక్తం చేయడం చూశాం.

హీరోకు ధీటుగా విలన్ పాత్రను డిజైన్ చేసిన శ్రీకాంత్ ఓదెల ఈసారి రాఘవ్ జ్యూయెల్ ని క్రూరమైన పెత్తందారీ పాత్రలో చాలా ఇంటెన్స్ గా చూపించబోతున్నాడట. కిల్ లో కిల్లర్ గా అదరగొట్టిన రాఘవ్ కు ఇది పెద్ద బ్రేక్ కానుంది. ఎందుకంటే ప్యారడైజ్ హిట్ అయితే తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకోవచ్చు. ఇప్పటిదాకా టాలీవుడ్ తెరమీద రాని షాకింగ్ క్యారెక్టరైజేషన్ ని నానికి రాసుకున్న శ్రీకాంత్ ఓదెల దాన్ని తెరమీద ఎలా చూపిస్తాడనే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో ఫుల్లుగా ఉంది. చిరంజీవితో చేయబోయే తన నెక్స్ట్ మూవీకి ఇది బలమైన పునాది వేయాలనే కసితో శ్రీకాంత్ ఓ రేంజ్ లో ప్యారడైజ్ ని తీస్తున్నాడట.

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

23 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

59 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago