Movie News

సమంత, రాజ్ చెట్టాపట్టాల్.. బాధతో ఆమె పోస్టు

స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడాక.. నాలుగేళ్లు తిరక్కుండానే విభేదాలు తలెత్తి విడిపోవడం.. అదే సమయంలో అనారోగ్యం పాలవడం.. మరోవైపు విడాకుల తాలూకు ట్రామాను అనుభవించడం.. ఇలా సమంత ఎన్నో ఇబ్బందులు పడింది. అవతల నాగచైతన్య కొత్త తోడును వెతుక్కుని రెండో పెళ్లి చేసుకోగా.. సమంత సింగిల్‌గానే ఉండడం అభిమానులకు నచ్చలేదు. ఐతే సమంత ఒంటరి జీవితానికి తెర పడిందని.. ఆమె జీవితంలోకి కూడా ఓ వ్యక్తి వచ్చేశారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

సమంత కీలక పాత్ర పోషించిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ రూపకర్తల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే ఈ ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తున్నారు. ఈ మధ్య ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. ఐతే రాజ్‌కు శ్యామలి అనే అమ్మాయితో ఇప్పటికే పెళ్లయింది. కానీ వాళ్లిద్దరూ ప్రస్తుతం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు రాజ్‌ను వదులుకోవడం ఇష్టం లేనట్లే కనిపిస్తోంది.

సమంత, రాజ్‌ రిలేషన్‌షిప్ గురించి వార్తలు బయటికి వచ్చినప్పటి నుంచి శ్యామలి తరచుగా తన ఆవేదనను వెళ్లగక్కుతూ క్రిప్టిక్ పోస్టులు పెడుతూనే ఉంది. తాజాగా సమంత.. రాజ్, అతడి సోదరితో కలిసి యుఎస్ పర్యటనకు వెళ్లింది. అక్కడ డెట్రాయిట్‌లో పర్యటిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. రాజ్, సమంత ఇందులో చాలా సన్నిహితంగానే కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న టైంలో శ్యామలి మరో క్రిప్టిక్ పోస్టు పెట్టింది. వివిధ మతాల సారాంశం ఈ పోస్టులో ఉంది. మతం ఏదైనా ఇతరులను మనం బాధ పెట్టకూడదని.. ఇదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని పేర్కొంది శ్యామలి. సామ్, రాజ్ యుఎస్ విహారం నేపథ్యంలోనే ఆమె ఈ పోస్టు పెట్టిందని భావిస్తున్నారు.

This post was last modified on July 9, 2025 4:25 pm

Share
Show comments
Published by
Kumar
Tags: RajSamantha

Recent Posts

‘పవన్ అన్న’ మాటే… ‘తమ్ముడు లోకేష్’ మాట!

కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…

2 hours ago

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

4 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

5 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

6 hours ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

10 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

13 hours ago