Movie News

ఆమిర్‌‌కు ఆ తమిళ హీరో అంత క్లోజా?

బాలీవుడ్ నటీనటులకు దక్షిణాది ఫిలిం సెలబ్రెటీలతో సంబంధాలు తక్కువగానే ఉంటాయి. ఇటీవలి కాలంలో అయినా సౌత్, నార్త్ యాక్టర్లు, టెక్నీషియన్ల కలయికలో సినిమాలు పెరుగుతున్నాయి కానీ.. ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు. అప్పుడప్పుడూ అక్కడి హీరోయిన్లు, విలన్లు ఇక్కడ అలా మెరిసి మాయం అయిపోయేవాళ్లంతే. అందువల్ల ఇక్కడి వాళ్లతో అక్కడి వాళ్లకు పెద్దగా పర్సనల్ రిలేషన్ ఉండేది కాదు. ఐతే తమిళంలో మిడ్ రేంజ్ హీరో అయిన విష్ణు విశాల్‌కు, బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన ఆమిర్‌కు మధ్య చాలా క్లోజ్ బాండ్ ఉన్న విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగమ్మాయి అయిన బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలను విష్ణు కొన్నేళ్ల కిందట పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఇటీవలే అమ్మాయి పుట్టింది.

తన నామకరణ వేడుకకు ఆమిర్ ఖాన్ అతిథిగా రావడం.. ఆయనే ఆ అమ్మాయికి ‘మీరా’ అని పేరు పెట్టడం విశేషం. ఈ సందర్భంగా జ్వాల ఏడుస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వేడుకకు ఆమిర్ రావడం, తనే పేరు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో విష్ణు విశాల్ మాట్లాడాడు. ఆమిర్‌ తమ కుటుంబానికి ఎంత క్లోజో అతను వెల్లడించాడు.

ఆమిర్ సోదరి క్యాన్సర్ బారిన పడి చెన్నైలో చికిత్స తీసుకున్నపుడు కొన్ని నెలల పాటు తమ ఇంట్లోనే ఉందని విష్ణు తెలిపాడు. అలాగే జ్వాల.. పది నెలల పాటు ఆమిర్ ఇంట్లో ఉన్నట్లు కూడా అతను వెల్లడించాడు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనడానికి తాము ఎంతో ప్రయత్నించామని.. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయిందని.. దీంతో తాము జ్వాల తీవ్ర నిరాశకు గురైందని విష్ణు తెలిపాడు. ఈ విషయాన్ని ఆమిర్‌తో పంచుకుంటే.. తనకు సన్నిహితుడైన డాక్టర్‌కు కనెక్ట్ చేసి తమ ప్రయత్నం ఫలించేలా చేశాడని.. అంతేకాక జ్వాలను ముంబయిలో తన ఇంట్లోనే పెట్టుకుని డెలివరీ అయ్యే వరకు పది నెలల పాటు జాగ్రత్తగా చూసుకున్నాడని విష్ణు తెలిపాడు. ఒక దక్షిణాది యువ నటుడికి.. ఆమిర్ లాంటి లెజెండరీ యాక్టర్‌తో ఇంత సన్నిహిత సంబంధాలుండడం విశేషంగానే చెప్పాలి.

This post was last modified on July 9, 2025 4:14 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

11 minutes ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

27 minutes ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

3 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

4 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

4 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

7 hours ago