చిరంజీవి సినిమాలకు బహుశా ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు వచ్చి ఉండదు. ఇంకా సగం షూటింగ్ కాకుండానే మెగా 157 ఓటిటి డీల్ దాదాపు క్లోజ్ అయ్యే స్టేజిలో ఉండగా విశ్వంభర ఎప్పుడు రిలీజవుతుందో తెలియని అయోమయంతో ఫ్యాన్స్ ని ఇంకా టెన్షన్ పెడుతూనే ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి బ్రాండ్ ఏ స్థాయిలో మార్కెట్ పెంచుకుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైతే అరవై కోట్ల దాకా బేరం జరుగుతున్నట్టు సమాచారం. అమెజాన్ ప్రైమ్ ముందు వరుసలో ఉందట. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ తెరవెనుక చర్చలైతే జోరుగా ఉన్నాయి. రేపో ఎల్లుండో క్లోజ్ కావొచ్చు.
విశ్వంభరది కూడా కొద్దిరోజుల క్రితం సేల్ అయ్యిందనే టాక్ వచ్చింది కానీ ఇంకా నిర్ధారణగా తెలియాల్సి ఉంది. గత ఏడాది టీజర్ లో విఎఫ్ఎక్స్ చూసిన ఓటిటి కంపెనీలు ఒక్కసారిగా ఈ ఫాంటసీ మూవీ మీద అనుమానాలతో వెనుకడుగు వేశారు. తర్వాత యువి క్రియేషన్స్, దర్శకుడు వశిష్టతో పాటు చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి విజువల్ ఎఫెక్ట్స్ ని పర్యవేక్షించడంతో అన్ని పనులు ఒక కొలిక్కి వచ్చాయని ఇన్ సైడ్ టాక్. నిజానికి విశ్వంభర అనౌన్స్ చేసిన టైంలో వచ్చిన క్రేజ్ కు ఓటిటి హక్కులు హాట్ కేకులా అమ్ముడుపోవాలి. కానీ స్లో టేకు అయ్యింది. కానీ మెగా 157 చిత్రీకరణలోనే హాట్ కేకులా మారిపోయింది.
ఇప్పుడు తేలాల్సింది విడుదల తేదీ వ్యవహారం. మెగా 157 రాబోయే సంక్రాంతికి రావడంలో ఎలాంటి అనుమానం లేదు. అనిల్ రావిపూడి అదే లక్ష్యంతో అకుంఠిత దీక్షతో షూటింగ్ చేస్తున్నాడు. సో వెనక్కు తగ్గే సమస్య లేదు. అయితే విశ్వంభర సెప్టెంబర్ లో వస్తుందా లేక ఏకంగా వచ్చే సంవత్సరం వేసవికి వెళ్తుందా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. మెగా కాంపౌండ్ టాక్ అయితే బ్యాలన్స్ ఉన్న ఒక్క పాట షూట్ చేస్తే ఆగస్ట్ చివరికల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసే దిశగా పనులు అవుతున్నాయని అంటున్నారు. కాకపోతే గుడ్ న్యూస్ చెప్పడానికి మరి కొంత టైం పడుతుందని సమాచారం. ఎంత సమయమనేది మాత్రం పజిల్.
This post was last modified on July 8, 2025 7:47 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…