హరిహర వీరమల్లు విడుదలకు ఇంకో పదిహేడు రోజులు మాత్రమే ఉంది. థియేటర్ బిజినెస్ కు సంబంధించి ఇంకా బేరాలు కొలిక్కి రాలేదని ఫిలిం నగర్ టాక్. ఏపీ తెలంగాణ కలిపి సుమారు నూటా నలభై కోట్లకు పైగా నిర్మాత ఏఎం రత్నం ఆశిస్తున్నట్టు ట్రేడ్ లో మాట్లాడుకుంటున్నారు. సహజంగానే నైజాం ధర అధికంగా పలుకుతోందట. అరవై అయిదు కోట్ల దాకా డీల్ జరగొచ్చని అంటున్నారు. సీడెడ్, ఆంధ్ర, కర్ణాటక ఇంకా తుది దశల చర్చల్లో ఉన్నాయి. ఏదైనా ఇంకో రెండు మూడు రోజుల్లో తేల్చేయాలి. టైం తక్కువగా ఉన్న నేపథ్యంలో చివరి నిమిషం దాకా ఒత్తిడి పెట్టుకుంటే లేనిపోని తలనెప్పి అవుతుంది.
మొన్నటిదాకా డ్రైగా ఉన్న హైప్ ట్రైలర్ వచ్చాక పెరిగింది. ఫ్యాన్స్ కు సినిమాలో గ్రాండియర్ నెస్ అర్థమైపోయింది. దర్శకుడు జ్యోతికృష్ణ కనక సరిగా హ్యాండిల్ చేసి ఉంటే బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. ఈ బయ్యర్ల వ్యవహారం తేలితే ఏఎం రత్నం తదుపరి పనులు చూసుకోవాల్సి ఉంటుంది. టికెట్ రేట్ల పెంపు ఎంత అడగాలి, బెనిఫిట్ షోలు అర్థరాత్రి ఒంటి గంట నుంచా లేక తెల్లవారుఝామున నాలుగు గంటల నుంచి మొదలుపెట్టాలానే దాని గురించి ఇంకా కంక్లూజన్ కు రాలేదట. చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక కొలిక్కి వస్తున్న టైంలో ఇవన్నీ ఒత్తిడి పెంచే వ్యవహారాలే.
వ్యాపారం సంగతి పక్కనపెడితే హరహర వీరమల్లుకి బిగ్గెస్ట్ ఓపెనింగ్ రావడం ఖాయమే. కుబేర తర్వాత బాక్సాఫీస్ మళ్ళీ డల్ అయిపోయింది. కన్నప్ప అంచనాలు అందుకోలేదు. తమ్ముడు దారుణంగా నిరాశపరిచింది. ఓ భామ అయ్యో రామా మీద బజ్ లేదు. పద్దెనిమిదో తేదీ రిలీజయ్యే వాటికి కూడా బజ్ అంతంత మాత్రమే. సో అధిక శాతం మాస్ జనాలు థియేటర్లకు దూరంగా ఉన్నారు. ఫ్యానిజం తో సంబంధం లేకుండా వాళ్లంతా హరిహర వీరమల్లుని చూసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం రికార్డులకు ఉప్పు పాతర మొదలైపోతుంది. దాని కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్.
This post was last modified on July 7, 2025 6:02 pm
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…