Movie News

వారం గ్యాప్… చిరు VS బాలయ్య ?

భారీ సినిమాలకు సంబంధించిన రిలీజు డేట్ల వ్యవహారం సస్పెన్స్ సినిమాలను మించిన ట్విస్టులతో సాగుతోంది. సెప్టెంబర్ 25 ఓజి, అఖండ 2 క్లాష్ మీద ఇప్పటికే ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకుల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. అన్న మాట ప్రకారమే పవన్ వస్తాడా రాడా అనే దాని మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా విశ్వంభరను సెప్టెంబర్ 18 రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో యువి క్రియేషన్స్ ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ ఒకవేళ ఓజి కనక డ్రాప్ అయితే విశ్వంభర ఆ స్లాట్ ని వాడుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు అంతర్గత సమాచారం.

అంటే ప్రస్తుతానికి ఓజి డేట్ సెప్టెంబర్ 25 ఉంటుంది. వాయిదా పడే సూచనలు ఏ మాత్రం ఉన్నా సెప్టెంబర్ 18 నుంచి 25కి విశ్వంభర షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు మరోసారి చిరంజీవి బాలకృష్ణల పోటీ చూడొచ్చు. లేదూ బాలయ్యతో పవన్ క్లాష్ ఫిక్స్ అయితే, మాత్రం అప్పుడు మెగాస్టార్ పక్కకు తప్పుకోవాల్సి రావొచ్చు. ఇదంతా ప్రస్తుతం ఊహాగానాల స్టేజిలోనే ఉంది. ఎందుకంటే విశ్వంభర ఐటెం సాంగ్ ఇంకా పెండింగ్ ఉంది. మౌని రాయ్ ని తీసుకున్నారనే వార్త వచ్చింది కానీ యూనిట్ నుంచి ఎలాంటి న్యూస్ లేవు. దర్శకుడు వసిష్ఠ విఎఫ్ఎక్స్ కోసమే లేట్ అవుతోందని, కాగానే విడుదల తేదీ అనౌన్స్ చేస్తున్నామని అంటున్నాడు.

యూనిట్ నుంచి వినిపిస్తున్న మాటల ప్రకారం టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ట్రైలర్ తో ఎగిరిపోతుందని అంటున్నారు. వశిష్ఠని తక్కువంచనా వేయడం కరెక్ట్ కాదని, తక్కువ బడ్జెట్ తో బింబిసారనే ఆ స్థాయిలో తీసినప్పుడు విశ్వంభర నుంచి బెస్ట్ ఆశించవచ్చని ఊరిస్తున్నారు. మెగా 157 లో బిజీగా ఉన్న చిరంజీవి త్వరలోనే బ్యాలన్స్ ఉన్న  విశ్వంభర పాట కోసం డేట్లు ఇవ్వబోతున్నారు. కొత్త సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయినప్పటికీ ఇంకా రిలీజ్ డేట్ సందిగ్ధం కొనసాగడం మెగా ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఏదైనా ఫ్రెష్ గా ప్రమోషన్లు చేసి హైప్ పెంచితే తప్ప విశ్వంభర మీద హైప్ పెరగడం కష్టం.

This post was last modified on July 4, 2025 8:20 pm

Share

Recent Posts

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

30 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

59 minutes ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

10 hours ago