హరిహర వీరమల్లు ట్రైలర్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచింది. పవన్ కళ్యాణ్ ని ఇంత శక్తివంతమైన పాత్రలో చూసిన ఆనందం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి కొన్ని కామెంట్స్ ఉన్నప్పటికీ అసలు ఆశలే తగ్గిపోయిన ప్రాజెక్టు నుంచి ఇంత క్వాలిటీ అవుట్ ఫుట్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన వాయిదాలతో ఇప్పటికే చాలా ఆలస్యమైన వీరమల్లు జూలై 24 రావడంలో ఎలాంటి అనుమానం లేదు. డిస్ట్రిబ్యూటర్ల అగ్రిమెంట్లు, థియేటర్లు లాక్ చేయడాలు మొదలైపోయాయి. ఇంకో వారం రోజుల్లో బిజినెస్ కు సంబంధించి వివరాలు బయటికి వచ్చే అవకాశముంది.
ప్రమోషన్లలో తొలి అడుగు ట్రైలర్ రూపంలో ఓకే అనిపించుకుంది కానీ అసలైన కొండ ఇంకా ముందుంది. చేతిలో ఉన్న 20 రోజుల్లో పబ్లిసిటీని పీక్స్ కి తీసుకెళ్లాలి. ముఖ్యంగా హిందీ మార్కెట్ ని టార్గెట్ చేసుకుంటే రీచ్ పెరుగుతుంది. ఈ విషయంలో కుబేర విఫలమయ్యింది. కన్నప్ప కొంచెం బెటరే కానీ వీక్ డేస్ లో అది కూడా డ్రాప్ అయిపోయింది. చావా తరహా కంటెంట్ వీరమల్లులో ఉంది కాబట్టి ఉత్తరాది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే నమ్మకం నిర్మాత ఏఎం రత్నంలో ఉంది. అదే జరిగితే పవన్ కు తొలి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దక్కుతుంది. బాబీ డియోల్ ఔరంగజేబుగా చేయడం మార్కెట్ పరంగా ప్లస్ అవుతోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. గతంలో తిరుపతిలో ప్లాన్ చేసుకుని క్యాన్సిల్ చేశారు. వారణాసిలో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన టీమ్ లో ఉందట కానీ చేతిలో ఉన్న తక్కువ సమయంలో ప్లానింగ్, పర్మిషన్లు గట్రా కష్టమైపోతాయి. దీనికి సంబంధించిన ఇన్ఫో ఇంకా రావాల్సి ఉంది. నిధి అగర్వాల్ మాత్రం ఇదో లైఫ్ టైం ఆపార్చునిటీలా ఎక్కడికి పిలిచినా వెళ్లి తనవంతుగా ప్రమోషన్లు చేస్తోంది. ఏపీ తెలంగాణలో బిగ్గెస్ట్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న హరిహర వీరమల్లుకి స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపు వగైరా వ్యవహారాలు ఎలాగూ ఉంటాయి. చూడాలి ఎలాంటి రికార్డులు నమోదవుతాయో.
This post was last modified on July 4, 2025 6:33 am
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…