కన్నప్ప ఫైనల్ రిజల్ట్ ఏంటనేది తెలియడానికి ఇంకొంచెం టైం పడుతుంది కానీ పరిశ్రమ ఇబ్బంది పడుతున్న ఒక విషయంలో మాత్రం మంచు విష్ణు దారి చూపించాడు. రిలీజ్ కు ముందు ట్రోలర్స్, యూట్యూబర్స్ కు ముందస్తుగా హెచ్చరిక ఇవ్వడం పని చేసింది. అదే పనిగా ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేసే వీడియోలు కన్నప్పకు ఎక్కువ రాలేదు. ఎటకారంగా రివ్యూలు చేసే వాళ్ళు కనిపించలేదు. ట్విట్టర్ లో ఉండే కొందరు ట్రోలింగ్ బ్యాచ్ ప్రీమియర్ షో తర్వాత మాయమైపోతే ఎక్కడికి వెళ్లారంటూ గంటల తరబడి ఫాలోయర్స్ ట్వీట్లు పెట్టిన వైనం సోషల్ మీడియాలో కనిపించింది. ఇదంతా విష్ణు తీసుకున్న జాగ్రత్త వల్లే.
దీన్ని దిల్ రాజు సైతం ఒప్పుకుంటున్నారు. విష్ణు ఫాలో అయిన పద్ధతినే తామూ అనుసరిస్తామని, కావాలని డ్యామేజ్ చేసే వాళ్ళను కట్టడి చేయడం మంచి ఆలోచనే అని మెచ్చుకుంటున్నారు. కావాలని ఎవరు చేసినా అది నిర్మాతకే నష్టమనేది అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరారు. ట్రోలింగ్స్ కి అడ్డుకట్ట వేయడానికి విష్ణు ఏం చేశాడనేది అధికారికంగా చెప్పలేదు కానీ గతంలో అతిగా ప్రవర్తించిన వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కి స్ట్రైక్ నోటీస్ పంపించడం, కాపీ రైట్స్ ఉల్లంఘన కింద బ్లాక్ చేయించడం లాంటి చర్యలు సత్ఫలితాన్ని ఇచ్చాయి. వీటి నుంచి బయటికి వచ్చేందుకు సదరు బ్యాచ్ కి తల ప్రాణం తోకకొచ్చేది.
ఇంత ఓపిక అందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలకు ఉండదు. కానీ తప్పదు. రివ్యూలు ప్రతి సినిమాకూ అవసరమే. అలాని కేవలం ట్రోలింగ్ ని ఆయుధంగా చేసుకోవడం సరికాదు. దిల్ రాజు కే ఈ మోడల్ నచ్చిందంటే భవిషత్తులో ఇకపై నిర్మాణ సంస్థలు ముందస్తు వార్నింగ్ నోటీసులు ఇవ్వడం అలవాటు చేసుకుంటారేమో. కమర్షియల్ రేంజ్ సంగతి పక్కనపెడితే కన్నప్ప విషయంలో మంచు విష్ణుకి ప్రశంసలు దక్కాయి. ప్రభాస్ క్యామియో మీదే ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ నటన పరంగా విష్ణు పెర్ఫార్మన్స్ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ కాన్ఫిడెన్స్ తోనే ప్రభుదేవా దర్శకత్వంలో ఒక మాస్ మూవీ చేయబోతున్నట్టు టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates