జూలై 11 విడుదల కావాల్సిన అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా పడటం దాదాపు ఫిక్స్. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలన్స్ ఉండటం వల్లే రేసు నుంచి తప్పుకున్నట్టు ఫ్రెష్ అప్డేట్. అందుకే ప్రమోషన్లు చేయకుండా సైలెంట్ గా ఉన్న యువి క్రియేషన్స్ మొత్తం వర్క్ అయ్యాక కొత్త డేట్ మీద నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇదిలా ఉండగా ఘాటీ వాయిదా సుహాస్ కు చాలా పెద్ద ప్లస్ కానుంది. ఎందుకంటే తన కొత్త సినిమా ఓ భామ అయ్యో రామా జూలై 11నే వస్తోంది. ప్రమోషన్లు చేస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మొన్న మహా న్యూస్ ఛానల్ మీద దాడి జరిగినప్పుడు సుహాస్ అక్కడే ఉన్నాడు.
చాలా పోటీగా మారుతుందనుకున్న ఘాటీ తప్పుకోవడంతో ఓ భామ అయ్యో రామా మీద ఆడియన్స్ అటెన్షన్ వెళ్ళిపోతుంది. అసలే సోలోగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సుహాస్ ఆశలన్నీ దీని మీద ఉన్నాయి. రైటర్ పద్మభూషణ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ దొరకలేదు. ఎప్పుడో ఒప్పుకుని చేసిన గొర్రె పురాణం, శ్రీ రంగనీతులు లాంటివి దారుణంగా ఫ్లాప్ కాగా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు కొంత పర్వాలేదనిపించుకుంది. దిల్ రాజు నిర్మించిన జనక అయితే గనక మీద నమ్మకంతో సుహాస్ ఓవర్సీస్ హక్కులు కొంటే అదేమో ఇంకో సూపర్ ఫ్లాప్ చేతిలో పెట్టి కష్టం, నష్టం రెండూ మిగిల్చింది.
ఆర్టిస్టుగా ఎంత బిజీగా ఉన్నా సుహాస్ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ భామ అయ్యో రామా కంటెంట్ చూస్తుంటే మంచి ఎంటర్ టైన్మెంట్ ఉన్నట్టే అనిపిస్తోంది. కాకపోతే బజ్ లేని ఇలాంటి టైంలో వసూళ్లు రావాలంటే పాజిటివ్ టాక్ చాలా కీలకం. అందులోనూ బాక్సాఫీస్ కొంచెం అప్ అండ్ డౌన్ లో ఉంది. కుబేర హిట్టయినా కన్నప్ప ఆశించిన స్థాయిలో దూసుకెళ్లడం లేదు.తమ్ముడు ఫలితం ఎల్లుండి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ భామ అయ్యో రామా కనక క్లిక్ అయితే థియేటర్ ఆడియన్స్ వస్తారు.సుహాస్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఉప్పు కప్పురంబు జూలై 4 నేరుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
This post was last modified on July 2, 2025 12:17 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…