టాలీవుడ్లో ఒకప్పుడు మంచి సక్సెస్ రేట్ ఉన్న పెద్ద బేనర్లలో ఒకటిగా ఉండేది యువి క్రియేషన్స్. ‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో అరంగేట్రం చేసిన ఈ సంస్థ మరిన్ని విజయాలందుకుంది. ప్రభాస్‌కు అత్యంత సన్నిహితులైన వంశీ, ప్రమోద్ కలిసి మొదలుపెట్టిన బేనర్ ఇది. దీన్ని ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థలాగే భావిస్తారందరూ. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించాక.. ఈ బేనర్లో ప్రభాస్ వరుసగా రెండు సినిమాలు చేశాడు. అవే.. సాహో, రాధేశ్యామ్. కానీ ఏం లాభం? ఆ రెండు చిత్రాలూ నిరాశపరిచాయి. వీటి వల్ల యువి అధినేతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది.
ఈ ఎదురుదెబ్బలు చాలవన్నట్లు యువి వాళ్లు లైన్లో పెట్టిన రెండు క్రేజీ ప్రాజెక్టులు ఇప్పుడు అయోమయ స్థితిలో పడిపోయాయి. మెగాస్టార్ చిరంజీవితో యువి అధినేతలు మొదలుపెట్టిన ‘విశ్వంభర’ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం.. సంవత్సరం చివరిలోపు అయినా వస్తుందా అన్నది అనుమానంగా మారింది. ‘విశ్వంభర’ వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఎంతకీ తెరపడడం లేదు.
‘విశ్వంభర’ పరిస్థితి ఇలా ఉంటే.. యువి వాళ్లు ప్రొడ్యూస్ చేస్తున్న మరో క్రేజీ మూవీ ‘ఘాటి’ సంగతి కూడా ఎటూ తేలడం లేదు. ఇప్పటికే ఈ సినిమాను ఒకసారి వాయిదా వేశారు. జులై 11కు కొత్త డేట్ ఇచ్చారు. కానీ అది దగ్గర పడుతున్నా గత కొన్ని రోజుల నుంచి సౌండ్ లేదు. తీరా చూస్తే సినిమా వాయిదా అనే సమచారం బయటికి వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం అవుతుండడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదట.
కొత్త డేట్ ప్రకటించి ఎక్కువ రోజులేమీ కాలేదు. మరి డేట్ ప్రకటించేటపుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయో అవగాహన లేదా అన్నది ప్రశ్న. కొత్త డేట్ ఎప్పుడో క్లారిటీ లేదు మరి. యువి లాంటి పెద్ద బేనర్ ప్రొడ్యూస్ చేసిన రెండు క్రేజీ ప్రాజెక్టుల విషయంలో ఈ అయోమయం ఏమిటో? వంశీ, ప్రమోద్‌లకు వరుసగా ఈ తలనొప్పులేంటి.. వారి ప్లానింగ్ ఎందుకు ఇలా దెబ్బ తింటోందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
This post was last modified on July 2, 2025 10:34 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…