సినిమాల్లో ఉన్నపుడైనా, రాజకీయాల్లోకి వచ్చాక అయినా పవన్ కళ్యాణ్ ఎవరినైనా చూసి చలించాడంటే అంతే.. లక్షల రూపాయలు.. అవసరమైతే కోట్లు కూడా సాయం ప్రకటించడానికి వెనుకాడడు. ఇలా పవన్ ఎంత సాయం చేశాడో లెక్కలేసి చెప్పడం కష్టం. ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో కొణిదెల అనే గ్రామానికి సొంత నిధుల నుంచి రూ.50 లక్షల సాయం ప్రకటించిన తన పెద్ద మనసును చాటాడు. తాజాగా ఆయన సీనియర్ కమెడియన్ వాసుకి అలియాస్ పాకీజాకు ఆర్థిక సాయం ప్రకటించారు. పవన్ అందించిన రూ.2 లక్షల సాయాన్ని జనసేన పార్టీ తరఫున నేతలు.. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పాకీజాకు అందజేశారు.
‘అసెంబ్లీ రౌడీ’ సహా పలు చిత్రాల్లో నటించి 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన పాకీజా.. కొన్నేళ్లుగా దీన స్థితిలో ఉన్నారు. ఆమెకు భర్త, పిల్లలు ఎవ్వరూ లేరు. తనను పట్టించుకునే వారు లేక.. రోజు వారీ ఖర్చులకు కూడా కష్టమవుతోందని.. సరైన తిండి కూడా తినలేకపోతున్నానని ఇటీవల పాకీజా ఒక వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
చెన్నైలో ఉండలేక ఏపీకి వచ్చేశానని.. విజయవాడకు వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కలిసే ప్రయత్నం చేశానని.. కానీ అపాయింట్మెంట్ దొరకలేదని పాకీజా ఆ వీడియోలో పేర్కొన్నారు. ఐతే విషయం తన వరకు రాగానే పవన్ స్పందించి సాయం అందించారు. దీనిపై పాకీజా ఉద్వేగభరితంగా స్పందించారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్లు మొక్కేదాన్నని అన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె చెప్పారు.
This post was last modified on July 1, 2025 4:31 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…