Movie News

డ్యామేజ్ పెంచుతున్న మెగా మౌనం

ప్రకటించిన టైంలో కేవలం ప్రీ లుక్ పోస్టర్ తోనే విపరీతమైన అంచనాలు రేపిన విశ్వంభర ప్రస్తుతం ఎప్పుడు విడుదలవుతుందో అర్థం కానీ డోలాయమానంలో ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తోంది. మెగా కాంపౌండ్ టాక్ వింటుంటే అసలు 2025లో రిలీజ్ ఉండకపోవచ్చట. వచ్చే సంవత్సరం వేసవికి విడుదల చేయాలని ప్రాథమికంగా అనుకున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం విశ్వంభర విఎఫ్ఎక్స్ పనులు ఒక కొలిక్కి వచ్చాయి. చిరంజీవి ఆ కాపీని చూడాలి. కానీ ఖాళీ లేదు. ఆయనేమో అనిల్ రావిపూడి మెగా 157 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఎక్కువ గ్యాప్ దొరకడం లేదు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.

చూస్తుంటే సంక్రాంతికి మెగా 157 ముందు రిలీజై ఆ తర్వాత తాపీగా విశ్వంభర వస్తుందనే కామెంట్స్ ఊపందుకుంటున్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే సంకల్పంతో దర్శకుడు వశిష్ఠ పగలు రాత్రి ఆ పనుల మీదే ఉంటున్నాడట. బింబిసార ఇచ్చిన ఇమేజ్ ని కాపాడుకోవడానికి విశ్వంభర ఒక పెద్ద అవకాశం. అందులోనూ కళ్యాణ్ రామ్ బింబిసార 2 తీద్దామని పిలిస్తే దాన్ని వదులుకుని మరీ మెగాస్టార్ కోసం ఇటొచ్చాడు. తీరా చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీల వల్ల అసలుకే మోసం వచ్చింది. టీజర్ టైంలో వచ్చిన నెగటివిటీని తట్టుకోలేకే తను బయట కనిపించడం మానేశాడని సన్నిహితుల మాట.

హరిహర వీరమల్లు లాగా లేట్ అయితే అయ్యింది కానీ ముందైతే స్పష్టమైన అప్డేట్స్ ఇవ్వడం ద్వారా అల్రెడీ పడిపోయిన బజ్ మెల్లగా అయినా లేపొచ్చు. ఇంకోపక్క చిరంజీవి బయట ఈవెంట్లకు వస్తున్నారు, సోషల్ మీడియాలో వివిధ రకాల విషయాలపై ట్వీట్లు పెడుతున్నారు కానీ ఎక్కడా మాట వరసకైనా విశ్వంభర ప్రస్తావన లేదు. ఇది డ్యామేజ్ ని మరింత పెంచుతోంది. మెగా ఫ్యాన్స్ ఇప్పటికే రావిపూడి సినిమా వైపు షిఫ్ట్ అయిపోయారు. దృశ్యంలో వెంకటేష్ స్టైల్ లో విశ్వంభర అంటే మాకు తెలియదు, చూడలేదు అనే తరహాలో సెల్ఫ్ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనికి చెక్ పడేది ఎప్పుడో చూడాలి.

This post was last modified on June 30, 2025 9:38 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Vishwambhara

Recent Posts

బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద అనుమానాలు

1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…

31 minutes ago

ప్రభాస్ కోసం బాస్ వస్తారా

జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…

2 hours ago

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

6 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

6 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

8 hours ago