Movie News

వయసు తగ్గించుకోబోతే.. ప్రాణం పోయిందా?

2002లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కాంటాలగా’ పాటతో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన షెఫాలీ జరివాలా.. రెండు రోజుల కిందట హఠాత్తుగా చనిపోవడం బాలీవుడ్‌కు పెద్ద షాక్. షెఫాలీ వయసు 42 ఏళ్లే. తనను చూస్తే అంత వయసున్నట్లు కూడా కనిపించదు. రోజూ జిమ్‌కూ వెళ్తూ, ఫిట్‌గా కనిపించే షెఫాలీకి గుండెపోటు రావడమేంటి.. చికిత్స అందించేలోపు చనిపోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణం కావచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఐతే షెఫాలీ విషయంలో కారణం వేరై ఉండచ్చని భావిస్తున్నారు. అందంపై ఉన్న శ్రద్ధే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చిందని అంటున్నారు.

వయసు పెరగకుండా యవ్వనంతో కనిపించేందుకు చికిత్స తీసుకుంటున్న షెఫాలీ.. ఈ క్రమంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రాణాలు వదిలిందని ముంబయి మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొంత కాలంగా షెఫాలీ యాంటీ ఏజియింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటోందట. ఇందులో భాగంగా రోజు ఇంజెక్షన్లు, మాత్రలు తీసుకుంటోందట. ఐతే శుక్రవారం ఉదయం ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉండడంతో అందుకోసం షెఫాలీ ఉపవాసం ఉన్నారట.

ఏమీ తినకుండా ఆమె యాంటీ ఏజియింగ్ ఇంజెక్షన్లు, మాత్రలు వేసుకోవడంతో శరీరంలో అత్యవసర పరిస్థితి తలెత్తిందని.. కార్డియాక్ అరెస్ట్ అయి నిమిషాల్లో ప్రాణం కోల్పోయారని మీడియా కథనాల్లో పేర్కొన్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందన్నది కుటుంబ వర్గాలే చెప్పాలి. ‘కాంటాలగా’తో ఫేమస్ అయ్యాక షెఫాలీ.. సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘ముజ్‌సే షాదీ కరోగీ’ సహా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ టీవీ షోలోనూ పాల్గొంది. 2004లోనే సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్‌ను పెళ్లాడిన షెఫాలీ… ఐదేళ్ల తర్వాత తన నుంచి విడిపోయింది. 2015లో ఆమె పరాగ్ త్యాగిని పెళ్లాడింది. షెఫాలీ ప్రాణాలు కోల్పోయినపుడు భర్త ఆమె వెంటే ఉన్నాడు.

This post was last modified on June 29, 2025 2:51 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

2 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

2 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

4 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

6 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

6 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

8 hours ago