ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా విశ్వంభర విడుదల కావడం లేదు కానీ స్టాలిన్ రీ రిలీజ్ జరిగనుంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో పూర్తి స్థాయి అంచనాలు అందుకోలేకపోయింది. అయినా సరే ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే మాస్ ఎలిమెంట్స్ స్టాలిన్ లో చూడొచ్చు. చిరు ఇంట్రో, ఇంటర్వల్ లో ప్రదీప్ రావత్ కు వార్నింగ్ ఇచ్చే సీన్, ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి చిరంజీవి చేసే ఫైట్, క్లైమాక్స్ లో సునీల్ ఇచ్చే ఎలివేషన్ మంచి పైసా వసూల్ స్టఫ్. అదనంగా త్రిషతో పాటలు, అనుష్క స్పెషల్ సాంగ్ బోనస్. ఇవి కాకుండా మణిశర్మ బిజిఎం గూస్ బంప్స్ ఇచ్చే స్థాయిలో ఉంటుంది.
ఇదంతా ఓకే కానీ అసలు విశ్వంభర అప్డేట్స్ ఇవ్వమని ఎదురు చూస్తుంటే ఇప్పుడు స్టాలిన్ ని తెరపైకి తేవడం చూస్తుంటే ఈ సంవత్సరం మెగా ఫాంటసీ మూవీ వస్తుందా రాదానే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విఎఫ్ఎక్స్ గురించి వార్తలు విని విని నెలలు గడిచిపోయాయి. సరిగ్గా గత ఏడాది ఆగస్ట్ 22న విశ్వంభర టీజర్ వచ్చింది. రావడం ఆలస్యం ట్రోలింగ్ బారిన పడింది. విజువల్ ఎఫెక్ట్స్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. దెబ్బకు టీమ్ సైలంట్ అయ్యింది. అప్పటి నుంచి ఈ పది నెలల కాలంలో యువి సంస్థ వదిలిన కంటెంట్ కేవలం రామ రామ లిరికల్ సాంగ్ ఒక్కటే అది కూడా యావరేజ్ అయ్యింది.
ఇంత ఆలస్యం కావడం గురించి టీమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు చిరంజీవి ఏమో మెగా 157 కోసం అనిల్ రావిపూడితో పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ నిజంగా కోరుకుంటున్నది స్టాలిన్ లాంటి పాత సినిమాలు కాదు. టైంకి కొత్తవి రిలీజ్ చేస్తే వాటిని సెలెబ్రేట్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ విశ్వంభరకు మోక్షం ఎప్పుడనేది అంతు చిక్కడం లేదు. గత నెల జగదేకవీరుడు అతిలోకసుందరి సక్సెస్ అయిన నేపథ్యంలో స్టాలిన్ కి అంతకు మించి స్పందన వస్తుందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. నాగబాబు నిర్మాతగా ఆరెంజ్, గుడుంబా శంకర్ రీ రిలీజుల్లోనే ఎక్కువ పే చేశాయి. మరి స్టాలిన్ ఏం చేస్తాడో.
This post was last modified on June 28, 2025 10:28 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…