Movie News

‘తమ్ముడు’ టైటిల్ వద్దన్న నితిన్

టాలీవుడ్ హీరోల్లోనూ ఫ్యాన్స్ ఉన్న స్టార్లలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన పేరు చెబితే ఊగిపోయే హీరోలు చాలామందే ఉన్నారు. వారిలో ముందు వరుసలో చెప్పుకోవాల్సింది నితిన్‌నే. కెరీర్ ఆరంభం నుంచి తనను తాను పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిగా చెప్పుకుంటూ వస్తున్నాడు నితిన్. తన సినిమాల్లో అతను పవన్‌కు ఇచ్చే ఎలివేషన్లు.. వాడే రెఫరెన్సుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నితిన్ పట్ల పవన్‌కు సైతం ఎంతో అభిమానం ఉంది. అతడి సినిమాలను ప్రమోట్ చేయడమే కాక.. తనతో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాను సైతం ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ఒక దశలో నితిన్ ప్రతి సినిమాలోనూ పవన్ రెఫరెన్సులు కనిపించడంతో తన అభిమాన హీరోను బాగా వాడేస్తున్నాడంటూ కొందరు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

ఈ విషయంలో నితిన్ కొంచెం నొచ్చుకున్నట్లే ఉన్నాడు. అందుకే తన కొత్త చిత్రానికి పవన్ కళ్యాణ్ టైటిల్ ‘తమ్ముడు’ పెట్టడానికి అతను ముందు ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు. దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు ముందుగా తనకు కథ చెప్పినపుడు ‘తమ్ముడు’ అని టైటిల్ చెప్పారని.. ఐతే తాను ఆ టైటిల్ వద్దని చెప్పానని నితిన్ వెల్లడించాడు. ఇప్పటికే తాను పవన్ కళ్యాణ్‌ను బాగా వాడేస్తున్నానని కొందరు అంటున్నారని.. అందుకే ఈ టైటిల్ సినిమాకు వద్దని తాను చెప్పానని నితిన్ తెలిపాడు.

కానీ పవన్ సినిమా టైటిల్ పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదని.. ఈ కథకు ఆ టైటిలే పర్ఫెక్ట్ అని తనకు నచ్చజెప్పడంతో సరే అన్నానని నితిన్ తెలిపాడు. పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ చేసి హిట్టు కొట్టిన వేణు శ్రీరామ్.. ఆ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా ‘తమ్ముడు’. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న నితిన్‌.. ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన ఒకప్పటి హీరోయిన్ లయ.. ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆమె నితిన్‌కు సోదరిగా నటిస్తున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కథానాయికల పాత్రలు పోషించారు.

This post was last modified on June 28, 2025 2:49 pm

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

4 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

7 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

7 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

8 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

9 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

9 hours ago